ఈ ఫోటోలోని స్టార్ దర్శకుడు ఎవరో గుర్తు పట్టారా..?

Durga First Look: ఈ ఫోటోని చూస్తే మీకు ఏం అనిపిస్తుంది. ఈ ఫోటోలోని వ్యక్తి అఘోరా, స్వామిజీలా కనిపిస్తున్నారా.? లేదా ఒక థ్రిల్లర్, హార్రర్ సినిమాలో లుక్ గా అనిపిస్తుందా. అవును ఈ ఫోటోని వ్యక్తి డాన్స్ మాస్టర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్. డాన్స్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్.. ఆ తర్వాత నటుడిగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.
తెలుగులో స్టైల్, మాస్, డాన్, రెబల్, ముని వంటి చిత్రాలను తెరకెక్కించాడు. హార్రర్ చిత్రాలను తెరకెక్కించడంలో లారెన్స్ రాఘవ దిట్టా. 'ముని', 'కాంచన', 'గంగ', కాంచన 3 చిత్రాలను తెరకెక్కించి హిట్ కొట్టాడు. అక్షయ్ కుమార్ హీరోగా 'లక్ష్మి' (కాంచన రీమేక్) మూవీ తీసి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇప్పుడు ఇపుడు 'దుర్గ' అనే టైటిల్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు.
ఈ పోస్టర్‌లో లారెన్స్ అఘోరా గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా లారెన్స్ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.' 'దుర్గ' చిత్రంతో మరోసారి తనకు ఆశీర్వాదించాలని లారెన్స్ కోరారు.
మొత్తంగా 'దుర్గా'గా లారెన్స్ ఈ సారి ఎలా అలరిస్తాడనేది చూడాలి. అయితే దుర్గా అనే సినిమా కాంచన స్వీక్వెల్స్ లో ఒకటని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
#Durga !!!
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021
Need all your blessings 🙏🏻 pic.twitter.com/pVYNepkgFM
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com