Raghavendra Rao: దాసరి రూట్లోనే రాఘవేంద్రరావు.. ఇక అందులో బిజీ బిజీ..

Raghavendra Rao (tv5news.in)

Raghavendra Rao (tv5news.in)

Raghavendra Rao: హైట్, వెయిట్ పర్ఫెక్ట్.. అది అచ్చం ఒక హీరో కట్ అవుట్. పొరపాటున దర్శకుడిగా మిగిలిపోయారా అని డౌట్.

Raghavendra Rao: హైట్, వెయిట్ పర్ఫెక్ట్.. అది అచ్చం ఒక హీరో కట్ అవుట్. ఆయన గురించి తెలిసిన తర్వాత హీరో అవ్వబోయి పొరపాటున దర్శకుడిగా మిగిలిపోయారా అని డౌట్. ఆయనను నేరుగా చూసిన వారెవరూ ఆయన వయసు 79 ఏళ్లంటే నమ్మలేరు. ఆయనతో నేరుగా మాట్లాడిన తర్వాతే అందరికీ అర్థమవుతుంది ఆయన ఇంకా యూతే అని.. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా. టాలీవుడ్‌లోని టాప్ మోస్ట్ సీనియర్ డైరెక్టర్ కే. రాఘవేంద్ర రావు గురించి.


కోవెలమూడి రాఘవేంద్ర రావు.. దర్శకేంద్రుడిగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో మర్చిపోలేని హిట్లు ఇచ్చిన డైరెక్టర్. ఒకప్పుడు ఆయన సినిమాల్లో నటించిన హీరోలు సూపర్ స్టార్లు అయ్యేవారు. హీరోయిన్లు వరుస సినిమాలతో బిజీ అయ్యేవారు. వంద సినిమాలకు పైగా డైరెక్షన్ చేసి ఎందరో హీరోలకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన కె.రాఘవేంద్ర రావు నటుడిగా ఎప్పుడూ ప్రేక్షకుల ముందుకు రాలేదు.


తెరవెనుక ఉంటూ సినిమాను నడిపించే దర్శకేంద్రుడు తెర ముందుకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అప్పుడప్పుడు ఏదో ఒక అవార్డు ఫంక్షన్‌లోనో, లేదా ఏవైనా ఈవెంట్లలోనో మైక్ పట్టుకొని రెండు మాటలు కూడా సరిగ్గా మాట్లాడని కె.రాఘవేంద్ర రావు ఒక టాక్ షో ద్వారా తన కెరీర్‌ను మన కళ్ల ముందు పెట్టారు. అందులో తాను తెరకెక్కించిన సినిమా విశేషాలను నెమరువేసుకుంటూ, ఆ నటీనటులతో ముచ్చటిస్తూ, ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను చెప్పేవారు. ఇప్పుడు స్వయంగా ఆయనే నటుడిగా మన ముందుకు వచ్చారు.


పాతికేళ్ల క్రితం కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లిసందడి.. అందులోని పాటలు, లీడ్ రోల్స్ చేసినవారి నటన, సంగీతం, పాటలు, సౌందర్యలహరి పాత్ర.. ఇవన్నీ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రనే వేశాయి. అందుకే ఇన్నేళ్లయినా పెళ్లిసందడి ఇంపాక్ట్ ఇంకా తగ్గలేదు. ఇది గమనించిన రాఘవేంద్ర రావు.. శ్రీకాంత్ తనయుడిని హీరోగా పెట్టి పెళ్లిసందడికి సీక్వెల్ తెరకెక్కించాడు.


పెళ్లిసందడి సీక్వెల్‌కు దర్శకేంద్రుడు డైరెక్టర్‌గా వ్యవహరించలేదు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టి డైరెక్షన్ బాధ్యతను గౌరీ రోనంకికి అప్పజెప్పారు. పర్యవేక్షణతో పాటు వశిష్టగా ఒక పాత్రలో కూడా మెరిసారు రాఘవేంద్ర రావు. మొదటిసారి ఆయన తెరపై నటుడిగా కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయిపోయారు. దర్శకేంద్రుడిలో అందరినీ మెప్పించగల నటుడు కూడా ఉన్నాడని ఇన్నాళ్లకు నిరూపించారు రాఘవేంద్రరావు.


దర్శకేంద్రుడు.. నటవిశ్వరూపం ఎలా ఉంటుందో చూద్దామని చాలామంది ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపించారు. కొత్త పెళ్లిసందడి సినిమాలో ఆయన గెటప్ మామూలుగా లేదు. బాగా రిచ్ లుక్ లో అదరగొట్టారు. చెప్పాలంటే లేటు వయసులో ఘాటు క్యారెక్టర్లకు పర్ ఫెక్ట్ మ్యాన్ దొరికారంటోంది టాలీవుడ్. పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు రాఘవేంద్రరావు సూటవుతారని ఫిలింనగర్ టాక్. అప్పట్లో దాసరినారాయణరావు కూడా డైరెక్షన్ చేస్తూనే.. యాక్టర్ గా రాణించారు. తరువాత కళాతపస్వి కె.విశ్వనాథ్.. డైరెక్టర్ గా ఉంటూనే.. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఇప్పుడు దర్శకేంద్రుడు కూడా ఇదే రూట్ లో వెళ్లొచ్చని తెలుస్తోంది.


ఏదైతే ఏం.. ఇన్నాళ్లూ టాలీవుడ్.. ఏదైతే వినలేను అనుకుందో.. అది వినేసింది.. అవే దర్శకేంద్రుడి మాటలు. టాక్ షోలో నాన్ స్టాప్ గా మాట్లాడారు కదా. అలాగే.. ఏదైతే చూడలేను అనుకుందో అది చూసేసింది.. అదే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు యాక్టింగ్. అలా టాలీవుడ్ రెండు కోరికలూ తీరిపోయాయి.

Tags

Read MoreRead Less
Next Story