Maa Elections 2021 Results: జీవితపై జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలుపు

Maa Elections 2021 Results : మా ఎన్నికల్లో మంచి విష్ణు ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా రఘుబాబు గెలిచారు. తొలి నుంచి తన విజయంపై నమ్మకంతో ఉన్న రఘుబాబుకు ఇప్పుడు అనుకున్నట్టే ఫలితం వచ్చింది. దీంతో ఆయన ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేసిన జీవితా రాజశేఖర్ పై ఆయన విజయం సాధించారు.
మా ఎన్నికల్లో ప్రధానమైన పోస్టుల విషయంలో పోటా పోటీ నెలకొంది. అందుకే ఏ పోస్టుకు ఏ ప్యానల్ నుంచి ఎవరు ఎన్నికవుతారా అన్న ఉత్కంఠ చివరి వరకు కొనసాగింది. కానీ ఇంతటి నరాలు తెగే టెన్షన్ పోరులో కూడా రఘుబాబు విజయం సాధించారు. దీంతో ఆయనను మంచు విష్ణు అభినందించారు.
అటు ట్రెజరర్ గా శివబాలాజీ, ఇటు జనరల్ సెక్రటరీగా రఘుబాబు.. ఇద్దరూ గెలవడంతో మంచు విష్ణు ప్యానల్ ఆనందంలో మునిగితేలింది. ఎందుకంటే ఈ రెండూ చాలా కీలకమైన పదవులు. ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా.. ఏవైనా పనులకు డబ్బులు ఖర్చుపెట్టాలన్నా వీళ్ల చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ రెండు పోస్టులు తమకే దక్కడంతో మంచు శిబిరం సంతోషంగా ఉంది.
మా ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ అభ్యర్థులను చాలా టెన్షన్ పుట్టించింది. ఎవరి ప్యానల్లో ఎవరు ఎన్నికవుతారో తెలియక మెంబర్లంతా కన్ఫ్యూజ్ అయ్యారు. ఎందుకంటే దీని ప్రభావం అధ్యక్ష స్థానంపైనా పడే అవకాశం ఉండడంతో వారితో తొలుత ఆందోళన కనిపించింది. ఒకవేళ రిజల్ట్ తారుమారుగా వచ్చుంటే.. ఎన్నికైన టీమ్ కలగూరగంపలా మారుండేది. దీనివల్ల ఆ టీమ్ పాలన కూడా కష్టమయ్యేది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com