Raghuvaran : రఘువరన్ పై డాక్యుమెంటరీ టీజర్

Raghuvaran :  రఘువరన్ పై డాక్యుమెంటరీ టీజర్
X

రఘువరన్.. ఎన్నో ఐకనిక్ పాత్రలకు ప్రాణం పోసిన నటుడు. తన వయసుకు మించిన పాత్రలను చిన్నతనంలోనే పోషించి శెభాష్ అనిపించుకున్న ఆర్టిస్ట్. అతని హైట్, హెయిర్ స్టైల్, కళ్లు.. ఇంకే ఆర్టిస్ట్ లోనూ కనిపించని విలక్షణత అతని సొంతం.బాషాలో ఆంటోనీ అయినా శివలో భవానీ అయినా, సుస్వాగతంలో పవన్ కళ్యాణ్ తండ్రిగా అయినా అంత సులువుగా మర్చిపోలేని పాత్రలు ఇవి. ఈ తరానికి అతని గురించి పెద్దగా తెలియదేమో కానీ.. 90స్ లో విలనిజానికి కొత్త ఒరవడి క్రియేట్ చేసిన నటుడు రఘువరన్. చాలా చిన్న వయసులోనే కన్నుమూయడం వెండితెర చేసుకున్న దురదృష్టం అని చెప్పాలి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా బిజీగా ఉన్న రోహిణిని 1996లో పెళ్లి చేసుకున్నాడు రఘువరన్. కానీ వీళ్లు 2004లో విడాకులు తీసుకున్నారు.

కేరళలో పుట్టిన రఘువరన్ చెన్నైలోని ఎమ్.జిఆర్ గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ యాక్టింగ్ స్కూల్ లో నటన నేర్చుకున్నాడు. 1982లో హీరోగా మారాడు. సినిమా విజయం సాధించినా అవకాశాలు రాలేదు తర్వాత సిల్క్ సిల్క్ సిల్క్ అనే చిత్రంలో విలన్ పాత్రకు తిరుగులేని గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి విలన్ గానే రాణిస్తూ అప్పుడప్పుడూ పాజిటివ్ రోల్స్ లోనూ సత్తా చాటాడు. ప్రధానంగా తమిళ్ అయినా తెలుగు, కన్నడ, మళయాల, హిందీ భాషల్లోనూ అనేక చిత్రాల్లో తనదైన ముద్రను వేశాడు.తెలుగులో పసివాడి ప్రాణం ఫస్ట్ మూవీ. ఆటాడిస్తా చివరి సినిమా.

2008లో నిద్రల ఉండగానే హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. అయితే అతను చైన్ స్మోకర్. బాగా మద్యం సేవించేవాడు. డ్రగ్స్ కూడా అలవాటు ఉన్నాయి అనే ప్రచారం ఉండేది. వీటి కారణంగానే అనారోగ్యంతో మరణించాడు.

అలాంటి రఘువరన్ పై ప్రస్తుతం ఓ డాక్యుమెంటరీ వస్తోంది. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఏమంత గొప్పగా లేకపోయినా ఓ గొప్ప నటుడి మెమరీస్ ను మరోసారి గుర్తు చేసుకునేలా డాక్యుమెంటరీ అయినా ఉంటుందేమో చూడాలి.

Tags

Next Story