Rahul Gandhi : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై రాహుల్ సంచలన వ్యాఖ్యలు..

Rahul Gandhi : తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవిరేసులో లేనన్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. తన నిర్ణయాన్ని ఎప్పుడో చెప్పేశానన్నారు. కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించడమంటే... దేశానికి ప్రాతినిథ్యం వహించిడం లాంటిందేనన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి అనేది ఓ పదవి కాదని... అది ఓ సైద్దాంతిక వ్యవస్థ అన్నారు. రాహుల్ భారత్ జోడో యాత్ర 15వ రోజుకి చేరింది. ఎర్నాకులంలోని దేశోం జుమా మజీద్ నుండి ఇవాళ ఉదయం యాత్ర ప్రారంభమైంది.
ఉదయం పది గంటలకు మార్నింగ్ బ్రేక్ ఇచ్చారు..కారుకుట్టి కప్పేలా జంక్షన్‌లో పాదయాత్రకు విరామం ఇచ్చారు. అక్కడ రాహుల్ విశ్రాంతి తీసుకున్న రాహుల్ ఎర్నాకుళం కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం అంగమలైలోని అడిలెక్స్ ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్‌లో మీడియా సమావేశం నిర్వహించిన రాహుల్ గాంధీ..... తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు.
లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్ర చిరంగార నుంచి మొదలు కానుంది. చిరంగార బస్టాప్ నుంచి చాలుకుడి టౌన్‌హాల్ వరకు కొనసాగనుంది రాహుల్ పాదయాత్ర. ఈ రాత్రికి అలువాలోని త్రిసూర్ జిల్లా చాలుకుడి లోని క్రిసెంట్ కన్వన్షన్ సెంటర్‌లో రాహుల్ గాంధీ బస చేస్తారు. ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 300 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది.
మరోవైపు భారత్ జోడో యాత్ర కేరళలో ఉత్సాహంగా కొనసాగుతుంది. రాహుల్ పాదయాత్రలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ రాహుల్ ముందుకు సాగుతున్నారు. చిన్నారులు, పెద్దలు రాహుల్ తో కరచాలనం చేసేందుకు పోటీపడుతున్నారు. పలు ప్రాంతాల్లో రాహుల్ గాంధీ రహదారి పక్కన ఉన్న ప్రజల వద్ద ఆగి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com