Raj Tarun : రాజ్ తరుణ్ తేడానా.. లేక

రాజ్ తరుణ్ దండయాత్ర ఆగడం లేదు. జూలై 26న పురుషోత్తముడు ఆ తర్వాతి వారమే ఆగస్ట్ 2న తిరగబడర సామీ అనే మూవీస్ తో వచ్చాయి. ఈ రెండూ పోయాయి. అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే.. ఈ రెండు సినిమాల విడుదలకు ముందు నుంచే అతని మాజీ లవర్ లావణ్య తో మీడియా మొత్తం రచ్చ అవుతోంది. కేస్ ల వరకూ వెళ్లారు. ఆ పంచాయితీ ఈ సినిమాల ప్రమోషన్స్ కు ఉపయోగపడుతుందా అనుకున్నారు. బట్ అలా జరగలేదు. ఇక ప్రస్తుతం అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పై ఉన్న రాజ్ తరుణ్ నుంచి మరో మూవీ రాబోతోంది. అదే భలే ఉన్నాడే. శివసాయి వర్ధన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి దర్శకుడు మారుతి ప్రెజెంటర్ కావడం విశేషమైతే.. మంచి కాస్టింగ్ కూడా కనిపిస్తోంది. లేటెస్ట్ గా భలే ఉన్నాడే ట్రైలర్ విడుదలైంది.
ఈ మూవీ టీజర్ కే మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్ గా ఉంది.తను ప్రేమించే వాడు తనను దగ్గరకు రానివ్వకపోయినా.. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి.. అసలు అతను మగాడేనా.. లేక తేడా అని అతని చుట్టూ ఉన్నవాళ్లంతా అనుమానించడం.. కొన్నిసార్లు అవమానించడం వరకూ వెళుతుంది. అయితే ఎంతో అందమైన అమ్మాయి ఎదురుగా ఉన్నా.. ఆమె అతన్ని ముద్దు పెట్టుకున్నా.. ఎందుకు అతన చలనం లేకుండా కనిపిస్తున్నాడు. తన తేడా అని అందరితో ఎందుకు మాటలు పడుతున్నాడు. దీని వెనక ఉన్న కథేంటీ అనేది సినిమాలో చూడాలి. ఆ మేరకు ఇంట్రెస్ట్ పెంచేలానే ఉంది ట్రైలర్. మరి ట్రైలర్ బావుంటేనే కదా సినిమా చూడాలన్న ఫీలింగ్ వస్తుంది. ఓ రకంగా చెబితే భలే ఉన్నాడే ట్రైలర్ బావుందనే చెప్పాలి.
రాజ్ తరుణ్ సరసన మనీషా కందూర్ హీరోయిన్ గా నటించింది. విశేషం ఏంటంటే.. ఈ మూవీని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న విడుదల చేయబోతున్నారు. అంటే నెల తర్వాత వెంటనే మరో సినిమా అన్నమాట. నా సామిరంగాతో కలిపితే ఈ యేడాది రాజ్ తరుణ్ కు ఇది నాలుగో సినిమా అవుతుంది. కానీ విజయం వస్తేనే కదా మరో నాలుగు సినిమాలు పడేది.
మరి ఈ భలే ఉన్నాడే మూవీ థియేటర్లో ప్రేక్షకుల చేత కూడా భలే ఉందీ సినిమా అనిపించుకుంటుందా లేదా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com