Balakrishna : జక్కన్నతో బాలయ్య.. 40 నిమిషాల పవర్‌‌ఫుల్ రోల్..!

Balakrishna : జక్కన్నతో బాలయ్య.. 40 నిమిషాల పవర్‌‌ఫుల్  రోల్..!
Balakrishna : ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే అనౌన్సు చేశాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది.

Balakrishna : బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RRR.. జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్‌‌లు మెయిన్ లీడ్‌‌లో నటించిన ఈ చిత్రంలో అలియా భట్ హీరోయిన్‌‌గా నటించింది. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్‌‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. కరోనా వలన పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకి మార్చ్ 25 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ఇప్పటికే అనౌన్సు చేశాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. కెఎల్ నారాయణ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకి నందమూరి బాలకృష్ణని తీసుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో బాలయ్య పాత్ర 40 నిమిషాల పాటు వెరీ పవర్ఫుల్ గా ఉంటుందట.. సినిమాకి ఈ రోల్ మెయిన్ సోల్ అని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ పాత్ర గురించి బాలయ్యకి వివరించారట జక్కన్న.. అయితే బాలయ్య దీనికి ఓకే చెప్పాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట మూవీని చేస్తున్నాడు.. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాకి గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంవహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అటు బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story