RRR Movie : RRR అరుదైన రికార్డు.. IMDBలో ఏకైక ఇండియన్ సినిమా..!
RRR Movie : యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఆర్ఆర్ఆర్.. భారీ అంచనాల నడుమ గత నెల మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. తాజాగా ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
ప్రముఖ ఇంటర్నేషనల్ మూవీ డేటా బేస్ సంస్థ (IMDB)లో మోస్ట్ పాపులర్ లిస్టులో ఉన్న ప్రపంచంలోని టాప్ 5 సినిమాల్లో చోటు దక్కించుకుంది. IMDBలో టాప్ 5లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా RRR నిలవగా.. ఇతర హాలీవుడ్ సినిమాలకు మించి దీనికే ఎక్కువ రేటింగ్ ఉండడం విశేషం.. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
ఇటీవల ఆస్కార్-విజేత CODA చిత్రం జాబితాలో అగ్రస్థానంలో ఉంది. డెత్ ఆన్ ది నైల్, మార్బియస్ మరియు బ్యాట్‌మాన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక RRR చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిగా ఈ మూవీలో రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌గా నటించి ఆకట్టుకున్నారు. వీరి సరసన అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. కీరవాణి సంగీతం అందించారు.
#RRRMovie at Top #5… Only Indian film in the most popular movies on @IMDB .
— RRR Movie (@RRRMovie) April 4, 2022
R R R…. 🔥🌊🌟 https://t.co/AqBfnVQnDY pic.twitter.com/3wKi7RCoRN
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com