Mahesh Babu : మహేష్ బర్త్ డేనూ పట్టించుకోని రాజమౌళి

Mahesh Babu :  మహేష్ బర్త్ డేనూ పట్టించుకోని రాజమౌళి
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్యాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీరి కాంబోలో వస్తోన్న ఫస్ట్ మూవీ కావడం.. ప్రస్తుతం రాజమౌళికి ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ ఉండటం మహేష్ కు కలిసొచ్చే అంశం. ఇక సినిమాల మేకింగ్ విషయంలో రాజమౌళి ఎంత ఖచ్చితంగా ఉంటాడో అందరికీ తెలుసు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ లోనే కొంత ఫుటేజ్ లీక్ అయింది. అంతే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. సెట్స్ లోకి అడుగుపెట్టడానికి ముందు మూడు దశల్లో చెకింగ్ చేసి ఎవ్వరూ మొబైల్ లోపలికి తీసుకు రాకుండా కట్టడి చేశాడు. ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు కంటెంట్ గురించి కూడా చెప్పలేదు. ఓపెనింగ్ కు మీడియాను ఇన్వైట్ చేయలేదు. ప్రెస్ ఇంటరాక్షన్ అసలే లేదు. అంత సీక్రెట్ మెయిన్టేన్ చేస్తున్నాడు జక్కన్న. సరే ఏం చేస్తే ఏంటీ.. ఎంత చేస్తే ఏంటీ మన హీరో సినిమా బాగా వస్తే చాలు అనుకుని కాంప్రమైజ్ అయ్యారు ఫ్యాన్స్. కాకపోతే సూపర్ స్టార్ బర్త్ డే కదా.. ఏదైనా స్పెషల్ వస్తే బావుండు అనుకున్నారు.

ఈ నెల 9న మహేష్ బాబు బర్త్ డే. దీంతో రాజమౌళి సినిమా నుంచి ఏదైనా లుక్ వస్తుందని ఆశిస్తున్నారు. బట్ అలాంటిదేం లేదట. మహేష్ బర్త్ డే అయినా ఏదైనా తన సినిమా నుంచి ఇప్పుడప్పుడే ఎలాంటి అప్డేట్ ఇచ్చేది లేదని భీష్మించుకున్నాడు. ఈ విషయంలో ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అవుతారు అని తెలిసినా జక్కన్న పంతం వీడటం లేదు. సో.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి బర్త్ డే స్పెషల్ అప్డేట్ లేదు కానీ.. సూపర్ స్టార్ బర్త్ డేకు త్రివిక్రమ్ అతడు 4కే అప్డేట్ తో రీ రిలీజ్ అవుతోంది. సో.. అదొక్కటే హ్యాపీ.

Tags

Next Story