Rajamouli : బన్నీ ఫ్యాన్స్‌‌కి షాకిచ్చిన జక్కన్న...!

Rajamouli : బన్నీ ఫ్యాన్స్‌‌కి షాకిచ్చిన జక్కన్న...!
Rajamouli : దాదాపుగా ఇండస్ట్రీకి ఒకే టైంలో వచ్చారు రాజమౌళి, బన్నీ.. కానీ వీరి కాంబినేషన్‌లో ఇంతవరకు సినిమా రాలేదు.

Rajamouli : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా కంప్లీట్ అయ్యాక ఐకాన్ స్టార్ బన్నీతో .. దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఉంటుందని గత కొద్ది రోజులగా సోషల్ మీడియాలో వార్తలు కోడై కూస్తున్నాయి. దాదాపుగా ఇండస్ట్రీకి ఒకే టైంలో వచ్చారు రాజమౌళి, బన్నీ.. కానీ వీరి కాంబినేషన్‌లో ఇంతవరకు సినిమా రాలేదు. మహేష్‌‌తో మూవీ కంప్లీట్ అయ్యాక వీరిద్దరూ కలిసి మూవీ చేయనున్నారంటూ వార్తలు రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.

అయితే ఈ వార్తల పైన రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం RRR ప్రమోషన్‌‌లో బిజీగా ఉన్న జక్కన్నకి ఈ ప్రశ్న ఎదురవ్వగా .. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. RRR మూవీ రిలీజ్ తర్వాత మహేష్ మూవీ పైన ద్రుష్టి పెడతానని రాజమౌళి వెల్లడించారు. అయితే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా బన్నీ, రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మహేష్, జక్కన్న కాంబోలో వచ్చే మూవీ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఉండనుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం నడుస్తోంది.

అటు RRR విషయానికి వచ్చేసరికి బాహుబలి లాంటి హ్యూజ్ సక్సెస్ తర్వాత జక్కన్న నుంచి సినిమా వస్తోండడం, చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించడంతో సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ మూవీలో ఒలివియా మోరిస్, అలియా భట్ హీరోయిన్ లుగా నటించారు. భారీ బడ్జెట్‌‌తో డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story