Rajamouli - Mahesh : మహేష్ - రాజమౌళి .. జస్ట్ ఓపెనింగ్ మాత్రమే కాదు

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ కాంబోలో మూవీ అనౌన్స్ అయింది. కానీ స్టార్ట్ కావడానికి చాలా టైమ్ పట్టింది. బట్ ఫైనల్ గా వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఈ జనవరి 2న ఈ మూవీ అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. మామూలుగా తన సినిమాల ప్రారంభోత్సవాలకు మహేష్ బాబు అటెండ్ కాడు. ఈ సారి పాత సెంటిమెంట్ ను ఫాలో కాలేదు. జక్కన్న కోసం ముహూర్తానికి హాజరయ్యాడు.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ఇవాళ్టి నుంచే స్టార్ట్ అవుతుంది. కొందరు ఇవాళ ప్రారంభోత్సవం జరుపుకుని సమ్మర్ నుంచి షూటింగ్ కు వెళుతుందని చెప్పారు. కానీ అది నిజం కాదు. ఇవాళ్టి నుంచే చిత్రీకరణ కూడా మొదలవుతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించి వినిపిస్తోన్న మరో అంశం.. రెండు భాగాలుగా ఉండబోతోందని. ఇప్పటి వరకూ అలాంటి అప్డేట్ మూవీ టీమ్ నుంచి రాలేదు. కాబట్టి అప్పుడే రెండు భాగాలు అని ఫిక్స్ కావడం తొందరపాటే అవుతుంది.
ఇక రాజమౌళి మూవీ అంటే షూటింగ్ ఎంత లేట్ అవుతుందో అందరికీ తెలుసు. ఈచిత్రం కూడా అలాగే ఆలస్యం అవుతుంది. చాలా వరకూ 2027 సంక్రాంతికి రావొచ్చు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. బట్ 2026లోనే విడుదల చేసేలా రాజమౌళి ప్లానింగ్ తో ఉన్నారని టాక్. తనపై ఉన్న లేట్ అనే ముద్రను తొలగించుకోవడం కోసం కాస్త ఎక్కువ ఎఫర్ట్ పెట్టబోతున్నాడని సమాచారం. కాకపోతే అది అవుట్ పుట్ పై ప్రభావం చూపిస్తుందనుకుంటే ఎంత లేట్ అయినా టైమ్ తీసుకునే వస్తాడు. సో.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవ్వాల్సిన పనిలేదు.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తోన్న ఈచిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఎప్పట్లానే విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుందని ముందు నుంచీ చెప్పారు. మొత్తంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com