Rajamouli : ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఇంకా నన్ను వెంటాడుతోంది : రాజమౌళి

Rajamouli : ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఇంకా నన్ను వెంటాడుతోంది : రాజమౌళి
Rajamouli : బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన జక్కన్న.. ఇప్పుడు RRR మూవీతో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయిపోయాడు.

Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ RRR.. బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన జక్కన్న.. ఇప్పుడు RRR మూవీతో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయిపోయాడు... ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించడం సినిమాకి మరో హైప్‌‌ని తీసుకొచ్చింది. మార్చి 25న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ మూవీ.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ థియేటర్లలో RRR సినిమాకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలైంది.

ఇదిలావుండగా జక్కన్న సినిమాలో నటించిన హీరోల తర్వాతి సినిమా కచ్చితంగా ఫ్లాప్ అవుతుందన్న రూమర్ ఇండస్ట్రీలో ఉండనే ఉంది. ఇప్పటి వరకు ఏ హీరో కూడా ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయలేదు. ఎన్టీఆర్ స్టూడెంట్ నెం.1 సినిమా నుంచి ప్రభాస్ బాహుబలి 2 వరకు అందరి హీరోలకు బ్లాక్‌‌బస్టర్ హిట్స్ అందించాడు జక్కన్న .. అయితే జక్కన్న సినిమాలో నటించిన హీరోల తర్వాత సినిమాలు మాత్రం ఫ్లాప్ అవుతున్నాయి. ఈ బ్యాడ్ సెంటిమెంట్ రాజమౌళి దర్శకత్వంలో నటించే హీరోలకి పెద్ద టెన్షన్‌‌గా మారిపోయింది.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాజమౌళికి ఈ ప్రశ్న మరోసారి ఎదురైంది.. అయితే దీనిపైన జక్కన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రశ్న తనకు చాలా ఏళ్లుగా ఎదురవుతున్నదని, 20 ఏళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నానని జక్కన్న అన్నారు. ఇంతకుముందే సమాధానం చెప్పినా మళ్లీ మళ్లీ ఈ ప్రశ్న ఎదురవుతున్నదని జక్కన్న వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లోతుగా చూడవద్దని అన్నారు.

తన హీరోల తర్వాత సినిమాల ఫ్లాపులతో తనకు ఎలాంటి సంబంధం స్పష్టం చేశాడు.. అలాగే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయని అన్నారు. రాజమౌళి ఇలా సమాధానం ఇస్తుండగా చరణ్, తారక్‌‌లు ఒకరి మొహం ఒకరు చూసుకోవడం విశేషం. మరి చరణ్, తారక్ తమ తర్వాత సినిమాలతోనైనా ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story