RRR Movie: 'ఆర్ఆర్ఆర్'లో చరణ్ డామినేషన్ ఎక్కువ అన్నదానిపై రాజమౌళి స్పందన..
RRR Movie: రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలయ్యి మూడు వారాలు కావస్తోంది. అయినా ఇంకా ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ మ్యానియా ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కొన్ని థియేటర్లలో ఆర్ఆర్ఆర్ హౌస్ ఫుల్ షోలు నడుస్తున్నాయి. ఎన్ని సినిమాలు విడుదలవుతున్న ఆర్ఆర్ఆర్‌పై ఏ మాత్రం ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాయి. అయితే ఈ సినిమా గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నడుస్తున్న వార్తలపై రాజమౌళి స్పందించాడు.
ఆర్ఆర్ఆర్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ పోటాపోటీగా నటించారు. అయితే రాజమౌళి కూడా ఈ ఇద్దరి పాత్రలలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చూపించకుండా ఇద్దరూ సమానమే అని చూపించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యింది కూడా. అయినా కొందరు ప్రేక్షకులు మాత్రం ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ డామినేషనే ఉంది అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ డామినేషన్ ఉంది అన్నదానిపై చరణ్ ఇటీవల స్పందించాడు. డామినేషన్ అనే మాటను తాను నమ్మనని, ఎన్‌టీఆర్ చాలా బాగా యాక్ట్ చేశాడని తెలిపాడు. అయితే ఇంకా ఈ ప్రచారం ఆగకపోవడంతో రాజమౌళి కూడా దీనిపై స్పందించాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ తమ బెస్ట్ ఇచ్చారని రాజమౌళి అన్నాడు.
చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉంది అన్నమాట కరెక్ట్ కాదు అన్నారు రాజమౌళి. ఏదైనా మనం చూసే దృష్టిలోనే ఉంటుందన్నారు. క్లైమాక్స్‌లో రామ్ చరణ్‌కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండడం వల్ల అప్పుడే అది చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకు చరణ్ డామినేషన్ ఉంది అనిపించవచ్చు. అదే కొమురం భీముడో పాట దగ్గరే క్లైమాక్స్ ఉండుంటే అప్పుడు ఎన్‌టీఆర్ డామినేషన్ ఉన్నట్టు అనిపించేది అని స్పష్టం చేశారు రాజమౌళి.
ఏదైనా ప్రేక్షకుల చూసే దృష్టిలోనే ఉంటుంది అన్నారు రాజమౌళి. కథాపరంగా చూస్తే ఇద్దరు హీరోలు ఒకరినొకరు రెండుసార్లు కాపాడుకుంటారని తెలిపారు. ఒకరకంగా చూసుకుంటే ఎన్‌టీఆర్ ఇందులో హీరో.. రామ్ చరణ్ తనను ఫాలో అవుతున్న పాత్రగా కనిపించవచ్చు. మరోరకంగా చూస్తే.. చరణ్ ఒక ఉపాధ్యాయుడిగా.. ఎన్‌టీఆర్ ఒక విద్యార్థిగా కనిపించవచ్చు అన్నాడు. అయినా ఇద్దరు స్టార్ హీరోల మధ్య బ్యాలెన్స్ లేకుండా ఆర్ఆర్ఆర్ 1000 కోట్లు కొల్లగొట్టేది కాదని స్పష్టం చేశాడు రాజమౌళి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com