RRR Movie: 'ఆర్ఆర్ఆర్'లో ఎన్‌టీఆర్ ఇంట్రడక్షన్ సీన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజమౌళి..

RRR Movie: 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీని వాయిదా వేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల కచ్చితంగా జరుగుతుంది అన్న నమ్మకంతో 'ఆర్ఆర్ఆర్' టీమ్ ప్రమోషన్స్‌ను కూడా ప్రారంభించింది. ప్రమోషన్స్ కోసం దాదాపు రూ. 2 కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత మరోసారి మూవీ వాయిదా పడాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఖరారు చేసుకోవడంతో మరోసారి ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.
'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ సమయంలో ఎన్‌టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్‌ల మధ్య సాన్నిహిత్యం ఎలా ఉంటుందో ప్రేక్షకులంతా చూశారు. వీరు సినిమా గురించి ఎంత మాట్లాడారో.. ఆ సినిమా వల్ల వీరు పొందిన అనుభూతి గురించి కూడా అంతే మాట్లాడారు. రామ్ చరణ్, ఎన్‌టీఆర్ గురించి, షూటింగ్ సెట్‌లో వారి ప్రవర్తన గురించి రాజమౌళి చేసిన పలు వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తాజాగా మరోసారి ఎన్‌టీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు జక్కన్న.
'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌లో చూసిన యాక్షన్ సీన్స్ అన్ని చాలావరకు బల్గేరియా అడవుల్లోనే జరిగాయి. ఆ షూటింగ్ సమయంలో దిగిన కొన్ని ఫోటోలను అప్పట్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మూవీ టీమ్. ముఖ్యంగా పులితో ఎన్‌టీఆర్‌కు ఉండే సీన్ కూడా అక్కడే షూట్ చేయబడింది. అది ఎన్‌టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అని టాక్ నడుస్తోంది. అయితే ఆ సీన్‌లో తారక్ ఇంటెన్సిటీ చూసి రాజమౌళి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట.
బల్గేరియాలో తారక్‌ను చెప్పులు లేకుండా పరుగులు పెట్టించారని, ఆ సమయంలో తనను చూస్తే పులిని చూసినట్టే అనిపించిందని అన్నాడు రాజమౌళి. అంతే కాకుండా రామ్ చరణ్‌తో షూటింగ్ అయిపోయిన రోజు తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని రాజమౌళి బయటపెట్టాడు. ఈ ముగ్గురి ఫ్రెండ్‌షిప్ ఎలా ఉంటుందో ఇప్పటికీ చాలా ప్రమోషనల్ కార్యక్రమాల్లో చూశారు ప్రేక్షకులు. అయితే ఆ ఫ్రెండ్‌షిప్పే సినిమాకు బలంగా మారిందని జక్కన్న తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com