RRR: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్.. రీ రిలీజ్‌కు రెడీ..
RRR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్, తారక్ పోటీపడి నటించారు. ఇందులోని నాటు నాటు డ్యాన్స్ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా ఇండస్ట్రీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది ఆర్ఆర్ఆర్ టీమ్.. రాబోయే ఆస్కార్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ కోసం పోటీ పడుతోంది. ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. దాదాపు 200 అమెరికన్ థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. యుఎస్‌లో ఆర్‌ఆర్‌ఆర్ పంపిణీదారు వేరియెన్స్ ఫిల్మ్స్ కొత్త ట్రైలర్‌తో ట్విట్టర్‌లో ఈ వార్తను పంచుకుంది. కొత్త ప్రోమోలో హాలీవుడ్ దిగ్గజాలు జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్ వంటి హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలతో సహా అంతర్జాతీయంగా సినిమా అందుకున్న అన్ని ప్రశంసల క్లిప్పింగ్స్ ఉంచారు. ఇక ఈ చిత్రం మార్చి 3న మళ్లీ US థియేటర్లలో సందడి చేయనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com