Rajamouli: 'నా హీరో.. మీకంటే బెటర్..' చిరంజీవిపై రాజమౌళి కామెంట్స్..

Rajamouli: ఎంతోకాలంగా మెగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆచార్య'. ఇప్పటివరకు మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి పలు సినిమాల్లో కనిపించినా.. ఫుల్ లెన్త్ మల్టీ స్టారర్‌గా వీరిద్దరూ నటిస్తున్న చిత్రమే 'ఆచార్య'. ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఫైనల్‌గా ఏప్రిల్ 29న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిరుపై ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజమౌళి.
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాజమౌళి. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు రామ్ చరణ్. దీంతో రాజమౌళి ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తే బాగుంటుందని మూవీ టీమ్ పంపించిన ఆహ్వానాన్ని మన్నించి వేడుకకు హాజరయ్యారు జక్కన్న. అయితే ఈ ఈవెంట్‌లో స్టేజ్‌పైనే రామ్ చరణ్‌పై, చిరంజీవిపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు రాజమౌళి.
'చరణ్‌కి చిరంజీవిగారు ఎటువంటి సలహాలు ఇవ్వరని నాకు తెలిసింది. ఇప్పటి వరకు తను చేసినవన్నీ చరణ్ తన సొంతంగా నేర్చుకున్నాడు. తను తప్పులు చేస్తే తనే సరిదిద్దుకున్నాడు. మెగాస్టార్ కొడుకైనా హార్డ్ వర్క్ చేసి ఎదిగాడు. ఇది నాకు కొత్తగా తెలిసింది. ఇలానే ఉండు చరణ్ నువ్వింకా ఎదుగుతావు. ఆయనంత కాకపోయినా తనకు సమానంగా ఉంటావు ఫ్యూచర్‌లో అని నేను కష్చితంగా చెప్పగలను'అంటూ రామ్ చరణ్‌ను ప్రశంసించారు రాజమౌళి.
ఇక చిరంజీవి గురించి మాట్లాడుతూ ఆయనలో కాంపటేటివ్‌నెస్ తనకు చాలా నచ్చింది అన్నారు రాజమౌళి. పక్కన ఉన్నది ఆయన కొడుకైనా కూడా తానే డామినేట్ చేయాలని చిరంజీవి కోరుకుంటారని తెలిపారు. ఒక అభిమానిగా చిరంజీవి గారే బాగా చేసారని అనిపిస్తుందని. కానీ చిరంజీవికంటే ఒక డైరెక్టర్‌గా తనకు తన హీరోనే బెటర్ అని రాజమౌళి అన్నారు. ఇలా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా సందడిగా జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com