SSMB 29 : మహేష్ మూవీతో షాక్ ఇస్తోన్న రాజమౌళి

ఒకప్పుడు రాజమౌళి అంటే సినిమా ఓపెనింగ్ రోజే కథ చెప్పి మరీ హిట్ కొట్టేవాడు. కొన్నాళ్లుగా ట్రెండ్ మార్చాడు. కథ చెప్పడం లేదు. మహేష్ బాబు మూవీతో అసలు ఓపెనింగ్ కు కూడా ఎవరినీ పిలవలేదు. అంతా సైలెంట్ గా చేసుకుపోతున్నాడు. ఇందులో కాస్టింగ్ గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారని మాత్రం తెలుసు. మరి మిగత పాత్రల్లో ఎవరూ అంటే ఎవరికీ ఏం తెలియదు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక్క విషయంలో సర్ ప్రైజ్ లు దాటి షాక్ లు ఇస్తున్నాడు జక్కన్న.
మామూలుగా రాజమౌళి మూవీ అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. బాహుబలి నుంచి ఆర్ఆర్ఆర్ వరకూ అదే జరిగింది. ఆర్ఆర్ఆర్ టైమ్ లో కోవిడ్ వచ్చిందని తప్పుకున్నా .. నిజానికి ఆయన కూడా చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక మహేష్ బాబు మూవీ అంటే 2027 లేదా 2028లో వస్తుందేమో అనే సెటైర్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వినిపించాయి. అంత స్లోగా చిత్రీకరణ చేస్తాడు రాజమౌళి. బట్ ఈ సారి అదే కనిపించడం లేదు.
కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో స్టార్ట్ అయిన లాంగ్ షెడ్యూల్ ను ముగించాడు. గ్యాప్ లో మహేష్ బయటి దేశం వెళ్లకుండా పాస్ పోర్ట్ లాగేసుకున్నాడు కదా. అందుకే ఈ ఎండల్లో మహేష్ బాబును తీసుకుని ఒడిషాలో మరో షెడ్యూల్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి కొంత ఫుటేజ్ లీక్ అయినా తర్వాత జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక షాకింగ్ న్యూస్ ఏంటంటే..ఇప్పుడు ఒడిషా షెడ్యూల్ కూడా పూర్తయింది. లేకపోతే ఇంత స్పీడ్ గా రాజమౌళి సినిమా తీయడం ఏంటా అని అంతా అదే ఫీలవుతున్నారు.
సో.. ఎప్పట్లానే నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడు, ఎక్కడ అనేవి ఆయనకు మాత్రమే తెలిసి ఉంటాయి కాబట్టి ఎవరూ అడగక్కర్లేదు. ఏదేమైనా రాజమౌళి దూకుడుకు ఈ సారి ప్రేక్షకులు షాక్ అవుతున్నారనే చెప్పాలి.

© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com