SSMB29 : మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన రాజమౌళి

టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ కాంబినేష్ అంటే ఇదే అని అందరికీ తెలుసు. అనౌన్స్ అయింది. ఆ మధ్య ఓపెనింగ్ కూడా అయిపోయింది. కానీ షూటింగ్ అప్డేట్స్ మాత్రం చెప్పడం లేదు. కొందరేమో అల్యూమినియం ఫ్యాక్టరీలో కొంత భాగం చిత్రీకరించారు అని చెప్పారు.అద నిజమా కాదా అనేది ఎవరికీ తెలియదు. ఈ మూవీలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకుంటున్నారు అనే ప్రచారం జరుగుతోందీ.. అదీ తేల్చడం లేదు. కాకపోతే ప్రస్తుతం తనకు ఫోటో షూట్స్ జరుగుతున్నాయనే న్యూస్ మాత్రం ఉంది.
ఇక చిన్న గ్యాప్ దొరికితేనే విదేశాలకు చెక్కేస్తుంటాడు మహేష్ బాబు. మళ్లీ అలా ఎలా వెళ్లిపోతాడో ఏమో అని రాజమౌళి ఓ సూపర్ ఐడియా వేశాడు. మహేష్ బాబు పాస్ పోర్ట్ ను తన వద్ద ఉంచుకున్నాడు. ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెబుతూ బంధించి ఉన్న ఓ సింహంతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దీనికి మహేష్ బాబు తనదైన శైలిలో 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను' అనే క్యాప్షన్ తో కామెంట్ చేశాడు. దీంతో ఈయన ఇది సినిమా కోసం ఇచ్చిన కమిట్మెంట్ గురించి అన్నాడా లేక విదేశాలకు వెళ్లే కమిట్మెంట్ గురించి అన్నాడా అనేది అర్థం కాకుండా పోయినా.. ఈ సరదా సన్నివేశం మాత్రం ఇద్దరి అభిమానుల్లో ఆనందాన్ని నింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com