Rajamouli: ఆ సీనియర్ హీరోతో 'మగధీర' తెరకెక్కించాలనుకున్న రాజమౌళి..

Magadheera movie (tv5news.in)
Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి.. బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన తర్వాత దేశవ్యాప్తంగా స్టార్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోయారు. ప్రస్తుతం ఆయన ఏం చేసిన పెద్ద సెన్సేషనల్‌లాగానే ఉంటుంది. బాహుబలి తర్వాత ఆయన మరొక సినిమా తెరకెక్కించకపోయినా.. రాజమౌళికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే ఆయన అప్‌కమింగ్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న జక్కన్న.. తాజాగా తన చిత్రం 'మగధీర' గురించి ఓ షాకింగ్ విషయం బయటపెట్టాడు.
బాహుబలితో ఎన్నో తెలుగు, ఇండియన్ సినిమా రికార్డులను తిరిగిరాసిన రాజమౌళి.. అంతకంటే ముందు 'మగధీర'తోనే సెన్సేషన్‌ను సృష్టించాడు. అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా.. అప్పటికి టాలీవుడ్‌లో అప్‌కమింగ్ యాక్ట్రెస్‌గా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న కాజల్ హీరోయిన్‌గా ఈ సినిమాను తెరకెక్కించాడు జక్కన్న.
మగధీర.. 50 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన మొదటి సినిమాగా రికార్డ్ సృష్టించింది. అయితే ముందుగా ఈ సినిమాను బాలకృష్ణతో తెరకెక్కించాలి అనుకున్నాడట రాజమౌళి. ఆ స్క్రిప్ట్ పట్టుకొని ఆయన దగ్గరకు వెళ్లారట కూడా. ఈ విషయాన్ని రాజమౌళి అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో బయటపెట్టారు. అయితే ఇప్పటివరకు రాజమౌళి, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఒక్క సినిమా కూడా రాలేదు.
బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే' షో ఓటీటీల్లో సూపర్ హిట్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇటీవల రాజమౌళి, కీరవాణి ఈ షోకు గెస్ట్‌లుగా వచ్చారు. ఈ సందర్భంగా రాజమౌళి, బాలయ్య పలు విషయాలపై సరదాగా ముచ్చటించారు. బాలయ్య అడిగిన సరదా ప్రశ్నలకు రాజమౌళి ఫన్నీగా సమాధానాలు చెప్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com