Rajanikanth: రిషబ్ నటనకు రజనీ ఫిదా.. కాంతారా హీరోకు ఖరీదైన బహుమతి..

Rajanikanth: కాంతారా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది. విడుదలైన అన్ని చోట్లా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సాధారణ ప్రేక్షకుల నుంచి సెలబ్రెటీల వరకు కాంతారాను ప్రశంసించారు. నటుడు రిషబ్ శెట్టి నటనకు ప్రేక్ష్కులు నీరాజనం పట్టారు. తలైవా రజనీకాంత్ కూడా రిషబ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. నీ నటనకు పొగడడానికి మాటలు చాలవు అంటూ ఓ బంగారు గొలుసుని అతడికి గిప్ట్‌గా ఇచ్చి అతడి నటనపై తన ప్రేమను చాటుకున్నారు.
రజనీకాంత్ ఇటీవల రిషబ్ శెట్టిని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించారు. ఆప్యాయంగా పలకరించి మంచి భోజనం పెట్టారు. 50 ఏళ్లకు ఒకసారి వచ్చే సినిమా ఇది అంటూ రజనీకాంత్ కాంతారా సినిమాపై ప్రశంసలు కురిపించారు.
'కాంతారావు' కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న, హిందీ వెర్షన్ అక్టోబర్ 14న విడుదలైంది. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి నిర్మాతగా, దర్శకుడిగా వ్యహరించారు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ మరియు చలువే గౌడ నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, మరియు కిషోర్ కుమార్ జి కీలక పాత్రలు పోషించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com