Rajanikanth-Jaishankar: ఆప్తమిత్రుడి మరణ వార్త తెలిసినా వెళ్లని రజనీ.. కారణం..

Rajanikanth-Jaishankar: రజనీకాంత్ కంటే ముందు జైశంకర్ చాలా తమిళ సినిమాల్లో నటించాడు.హాలీవుడ్ స్టైల్‌లో డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఆయనను అభిమానులు తమిళనాడు జేమ్స్ బాండ్ అని పిలిచేవారు. ఎందరో కొత్త దర్శకులు, నిర్మాతలకు అవకాశాలు ఇచ్చి వారిని ప్రోత్సహించేవారు జైశంకర్.
అవకాశాలు లేని సమయంలో రజనీ నటించిన మురతుక్కలై చిత్రంలో విలన్‌గాను నటించారు. అది క్లిక్ అవ్వడంతో పలు చిత్రాల్లో విలన్ గా నటించే అవకాశాలు అందిపుచ్చుకున్నారు. రజనీ నటించిన పలు సినిమాల్లో జైశంకర్ విలన్‌గా నటించాడు. అలా రజనీకి. జైశంకర్‌కు స్నేహం పెరిగింది. ఇద్దరూ అర్థరాత్రులు కూడా ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుకునేవారు. రజనీ తరచూ జైశంకర్ ఇంటికి వెళ్లి కాలక్షేపం చేస్తుండేవారు.
తలపతిలో జైశంకర్ రజనీ తండ్రి పాత్రను పోషించాడు. జైశంకర్‌తో రజనీకి అదే చివరి సినిమా. జూలై 2000లో జైశంకర్ మరణించాడు. ఆప్తమిత్రుడు అయినప్పటికీ, అతడు మరణించినప్పుడు రజనీ వెళ్ళలేదు.
జైశంకర్ మరణవార్త విన్న రజినీ అతడి కుమారుడికి ఫోన్ చేసి, 'నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న నవ్వుతూ నన్ను పలకరించేవాడు. ఇప్పుడు జీవం లేని వాడిని చూసే శక్తి నాకు లేదు. కాబట్టి, నేను రాలేను. తప్పుగా భావించవద్దు' అని రజనీ అన్నారు. ఈ విషయాన్ని జైశంకర్ తనయుడు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com