జైలర్ రివ్యూ.. రజనీ మార్క్ మారోసారి..

జైలర్ రివ్యూ.. రజనీ మార్క్ మారోసారి..
ఈ చిత్రంలో రజనీకాంత్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు, బహుశా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన పెట్టా తర్వాత అతని బెస్ట్ లుక్ ఇదే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఈ చిత్రంలో రజనీకాంత్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తారు, బహుశా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన పెట్టా తర్వాత అతని బెస్ట్ లుక్ ఇదే అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అన్నత్తే దర్బార్‌ చిత్రాల వరుస పరాజయాల తర్వాత , రజనీకాంత్ జైలర్‌పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బీస్ట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించి ప్లాపును మూటగట్టుకున్న దర్శకుడు నెల్సన్‌కి ఇది తాడో పేడో తేల్చుకునే చిత్రం.

ఇదిలావుండగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. మొత్తానికి ఇది రజనీకాంత్ సినిమానే. ఎంత మంది ప్రముఖ నటులు ఉన్నా ఫోకస్ అంతా రజనీ మీదే ఉంటుంది.

ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) జైలులో జైలర్‌గా పనిచేస్తుంటాడు. అయితే అతడు విధులు ఎంత కఠినంగా నిర్వహిస్తుంటాడో, కుటుంబం పట్ల అంతటి ప్రేమా ఆప్యాయతలు కనబరుస్తుంటాడు. ముత్తువేల్ (వినాయకన్) నేతృత్వంలోని అండర్‌గ్రౌండ్ మాఫియా ఉందని తెలుసుకుని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాడు. దీంతో వాళ్లు పాండియన్ కొడుకుని టార్గెట్ చేసి చంపేస్తారు.

ఒకవైపు వృత్తి మరోవైపు పగ, ఈ రెండిటి మధ్య ముత్తువేల్ పడిన సంఘర్షణే ఈ జైలర్ సినిమా. అయితే సినిమా ఫస్టాఫ్ చాలా స్లోగా ప్రారంభమవుతుంది. దాంతో రజనీనీ ఈ సినిమా కూడా దెబ్బ కొడుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతారు. కానీ ఆ తర్వాత నుంచే అసలు కధ ఆరంభమవుతుంది. నెల్సన్ మార్కు కామెడీ కనబడుతుంది. రజనీ మార్క్ మేనరిజం అభిమానులకు కనుల పండుగే అని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రంలో నటించిన ప్రముఖ తారాగణం కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఫస్టాఫ్ లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ఇక సెకండ్ హాఫ్ ప్రారంభం నుండే రజినీ విశ్వరూపం చూపిస్తాడు. మొదటి 20 నిమిషాల్లో వచ్చే జైలు సన్నివేశాలు, రజినీకాంత్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ అన్నీ ఆడియన్స్ రోమాలు నిక్కపొడిచేలా చేస్తాయి. చాలా కాలం తర్వాత రజినీకి ఒక మంచి సినిమా పడింది అనే అనుభూతిని ప్రేక్షకులకు కల్పించాడు దర్శకుడు. మిగిలిన నటీనటులందరూ తమ పరిధిమేర నటించారు. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story