Rajanikanth: యంగ్ హీరోలతో పోటీపడుతున్న సూపర్ స్టార్.. రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేదేలే..

Rajanikanth: యంగ్ హీరోలతో పోటీపడుతున్న సూపర్ స్టార్.. రెమ్యునరేషన్‌ విషయంలో తగ్గేదేలే..
Rajanikanth: ఆయన స్టైలే వేరు.. యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. డ్యాన్సులు రాకపోతేనేం ఆయనకోసమే రాసిన డైలాగులు, స్క్రిప్ట్‌తో అదరగొట్టేస్తారు.

Rajanikanth: ఆయన స్టైలే వేరు.. యంగ్ హీరోలతో పోటీ పడి నటిస్తున్నారు. డ్యాన్సులు రాకపోతేనేం ఆయనకోసమే రాసిన డైలాగులు, స్క్రిప్ట్‌తో అదరగొట్టేస్తారు. కమర్షియల్‌గా ఒక్కోసారి సక్సెస్ అవ్వకపోయినా కచ్చితంగా ఆయన మార్క్ కనిపిస్తుంది. అదే రజనీకాంత్ స్టయిల్.

సూపర్ స్టార్ రజనీకాంత్ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తలైవా తెరపై కనిపిస్తే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దద్దరిల్లుతుంది. ఆ స్థాయిలో వెండితెరను శాసిస్తారు. కాబట్టి రెమ్యునరేషన్ కూడా అంతే స్థాయిలో తీసుకుంటారు.

ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నారు. దీంతో పాటు లాల్ సలామ్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా కాకుండా అతిథి పాత్రలో నటిస్తున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.

లాల్ సలామ్ కోసం రజనీకాంత్ వారం రోజుల పాటు కాల్షీట్స్ కేటాయించారు. అయితే ఈ ఏడు రోజులకు భారీ పారితోషికం అందుకుంటున్నాడు. వారానికి రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు లైకా సూపర్‌స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రజనీకాంత్ త్వరలో లాల్ సలామ్ సెట్స్‌పైకి వెళ్లనున్నారు.

మరోవైపు 'జైలర్' సినిమా కోసం రజనీకాంత్ భారీగా డిమాండ్ చేశారు. ఈ సినిమాకు ఆయన రూ. 140 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. సౌత్ హీరోల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి.

Tags

Read MoreRead Less
Next Story