Rajasekhar : అందుకే మోహన్ బాబుతో ఆ సినిమా చేయలేదు : రాజశేఖర్
Rajasekhar : ఎడిటర్ మోహన్ నిర్మాతగా ఆయన కుమారుడు రాజా తెరకెక్కించిన చిత్రం 'హనుమాన్ జంక్షన్'.. మళయాళ సినిమా 'తెన్ కాశిపట్టణం' ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు.

ఎడిటర్ మోహన్ నిర్మాతగా ఆయన కుమారుడు రాజా తెరకెక్కించిన చిత్రం 'హనుమాన్ జంక్షన్'.. మళయాళ సినిమా 'తెన్ కాశిపట్టణం' ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో అర్జున్, జగపతిబాబు, వేణు, స్నేహ, లయ మెయిన్ లీడ్‌లో నటించారు. అయితే ముందుగా ఈ సినిమాని అప్పటి టాలీవుడ్ స్టార్ హీరోలైన మోహన్ బాబు, రాజశేఖర్ లతో చేయాలని అనుకున్నారు ఎడిటర్ మోహన్.. కానీ ఆ తర్వాత వారి ప్లేస్‌లోకి అర్జున్, జగపతిబాబు వచ్చారు. ఈ సినిమా నుంచి తప్పుకోవడం పట్ల ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు హీరో రాజశేఖర్.
సినిమా షూటింగ్ తొమ్మిది అంటే తాను పది గంటలకి వస్తానని, కానీ మోహన్ బాబు 9 గంటలకే వచ్చేస్తారని అన్నారు. టైమ్ విషయంలో తనకు క్రమశిక్షణ లేదని, దీనివలన మోహన్ బాబుతో ఉన్న మంచి రిలేషన్ దెబ్బతింటుందనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమా నుంచి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు రాజశేఖర్. అయితే ఈ సినిమాలో మోహన్ బాబు ఉన్నారన్న విషయం హీరో రాజశేఖర్‌కి ముందుగా తెలియదట.
ఆ తర్వాత తెలుసుకొని ఆ సినిమాకి తీసుకున్న అడ్వాన్స్‌ని కూడా వెనక్కి ఇచ్చి తప్పుకున్నారట రాజశేఖర్ . అలా మోహన్ బాబుతో తనకున్న సత్సబంధాలు పాడవ్వకుండా జాగ్రత్తపడ్డానని చెప్పుకొచ్చారు రాజశేఖర్.. ఆ తర్వాత మోహన్ బాబు కూడా హనుమాన్ జంక్షన్ సినిమా పైన ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫైనల్‌గా అర్జున్, జగపతిబాబులతో ఈ సినిమాని ఫినిష్ చేశారు ఎడిటర్ మోహన్.
RELATED STORIES
Tirumala: తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం...
14 Aug 2022 3:30 PM GMTMadhavaram: ఊరు ఊరంతా ఒక సైన్యం.. అందరూ సైనికులే..
14 Aug 2022 1:45 PM GMTMK Stalin: జగన్ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్...
14 Aug 2022 10:30 AM GMTChandra Babu : ప్రతీ ఒక్కరూ దేశభక్తి, జాతీయభావం పెంపొందించుకోవాలి :...
13 Aug 2022 6:47 AM GMTVizianagaram : బయటపడ్డ ఆ పురాతన లాకర్లో ఏముందంటే..?
13 Aug 2022 5:31 AM GMTYS Sunitha : వివేకా హత్య కేసుపై సుప్రీంను ఆశ్రయించిన వైఎస్ సునీత..
13 Aug 2022 4:07 AM GMT