Rajashekhar : శర్వానంద్ కోసం నిర్ణయం మార్చుకున్న రాజశేఖర్

Rajashekhar :  శర్వానంద్ కోసం నిర్ణయం మార్చుకున్న రాజశేఖర్
X

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ గా తిరుగులేని స్టార్డమ్ అనుభవించాడు రాజశేఖర్. అప్పటి టాప్ ఫోర్ హీరోస్ తో సమానమైన మార్కెట్ తో దూసుకుపోయాడు. 2000ల తర్వాత అతని దూకుడు తగ్గింది. స్టోరీ సెలెక్షన్ లో రాంగ్ స్టెప్స్ పడ్డాయి. వరుసగా డిజాస్టర్స్ పడ్డాయి. దీంతో తన సమకాలీక హీరోల్లో కొందరిలా తనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే అనుకున్నారు. కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలూ వచ్చాయి. కానీ తను ఇంకా నేను హీరోనే అని స్ట్రాంగ్ ఫిక్స్ అయి ఉన్నాడు. అతని నిర్ణయం కరెక్టే అని గరుడవేగ నిరూపించింది. ఈ మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆపై చేసిన కల్కి కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. జోసెఫ్ అనే మళయాల సినిమాను తెలుగులో శేఖర్ పేరుతో జీవిత డైరెక్షన్ లో రీమేక్ చేసినా అదీ పోయింది. నితిన్ తో ఎక్స్ ట్రార్డినరీ మేన్ లో తన టైలర్ మేడ్ రోల్ అయిన పోలీస్ గా నటించాడు. కానీ సినిమా ఆకట్టుకోలేదు. ఆ మధ్య హీరోగానే ఏదో సినిమా చేస్తున్నాడు అన్నారు కానీ అప్డేట్ ఏం లేదు. ఈ టైమ్ లో తను తండ్రి పాత్రకు షిఫ్ట్ అయ్యాడు అంటే ఆశ్చర్యమే. అయితే ఇది నిజం.

రాజశేఖర్ తండ్రిగా నటించబోతున్నాడు. అది కూడా శర్వానంద్ కు. రాజశేఖర్ - శర్వానంద్ తండ్రి కొడుకులుగా ‘జానీ’అనే సినిమా రూపొందబోతోంది. ఈ చిత్రంకోసం రాజశేఖర్ కు భారీ రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారట. రీసెంట్ గా సుధీర్ బాబుతో మా నాన్న సూపర్ హీరో అనే చిత్రాన్ని రూపొందంచిన అభిలాష్ కంకర ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. అయితే రాజశేఖర్, శర్వా ఇద్దరూ ఒకేసారి తండ్రి కొడుకులుగా కాక.. ఓ పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ లో మన యాంగ్రీ మేన్ కనిపిస్తాడట. అంటే ఆ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లోనే ఎండ్ అవుతుందా లేక సినిమా అంతా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా ఈ సీనియర్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఆఫర్స్ వెల్లువెత్తుతాయి అనేది నిజం.

Tags

Next Story