సీనియర్‌ నటి పై ట్రోలింగ్‌.. కారణం ఇదే!

సీనియర్‌ నటి పై  ట్రోలింగ్‌.. కారణం ఇదే!
మలయాళ సీనియర్ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ రజిని చాందీనుని సోషల్ మీడియాలో నెటిజన్లు వీపరితంగా ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్‌ చేయడానికి కారణం ఆమె ఇటీవల చేసిన ఫోటోషూట్..

మలయాళ సీనియర్ నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ రజిని చాందీనుని సోషల్ మీడియాలో నెటిజన్లు వీపరితంగా ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్‌ చేయడానికి కారణం ఆమె ఇటీవల చేసిన ఫోటోషూట్.. కేరళకు చెందిన ఫొటోగ్రాఫర్‌ అథిరా జాయ్‌ ప్రోత్సాహంతో ఆమె పాశ్చాత్య వస్త్రధారణలో గ్లామరస్ ఫొటోషూట్‌ నిర్వహించుకున్నారు. ఎక్కువగా చీరకట్టులో కనిపించే ఈమె.. ఫ్లోరల్‌ మాక్సీలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు.. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే కొందరు ఈ నటిని పొగడ్తలతో ముంచెత్తగా.. మరికొందరు మాత్రం ట్రోల్స్ చేశారు. నువ్వు ఇంకా చచ్చిపోలేదా? ఈ వయసులో ఇదేం బుద్ధి? అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పైన ఓ జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ గట్టి కౌంటర్ ఇచ్చారు రజిని చాందీను.. నా పైన చాలా మంది ట్రోల్‌ చేశారు. అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. నాకు తెలిసి 40-50 ఏళ్ల వయస్సున వాళ్లు నన్ను చూసి అసూయ పడుతున్నారేమో అనిపిస్తుంది.

బహుశా ఓ ముసలావిడ అందంగా ఉండడం వారికి నచ్చడం లేదేమో.. నాకు నచ్చిన పనిచేయడంలోనే సంతృప్తి దొరుకుతుంది. యవ్వనంలో ఉన్నపుడు కుటుంబ బాధ్యతలతోనే చాలా మందికి కాలం గడిచిపోతుంది.. అలాంటి వారికి ఇలాంటి వ్యాపకాలు స్ఫూర్తిగా నిలుస్తాయని భావిస్తున్నట్టుగా తెలిపారు. కాగా, రజనీ తన కెరీర్‌ను 60 వ ఏటా మలయాళ చిత్రం ఓరు ముతాస్సీ గాధతో ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆమె అమ్మమ్మ పాత్రలో నటించి మెప్పించారు. ఇక మోహన్ లాల్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ మలయాళ సీజన్ 2 లో ఆమె పోటీదారులలో ఒకరు.

Tags

Read MoreRead Less
Next Story