ఫ్యాన్స్ కి షాక్ : రాజకీయ రంగ ప్రవేశంపై వెనక్కి తగ్గిన రజనీకాంత్

Rajinikanth(File Photo)
రాజకీయ రంగ ప్రవేశంపై సూపర్ స్టార్ రజనీకాంత్ వెనక్కి తగ్గారు. ఇప్పట్లో పార్టీని ప్రారంభించలేనంటూ షాక్ ఇచ్చారు. అభిమానులకు క్షమాపణలు చెబుతూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. రజనీ కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్లనే రాజకీయ రంగ ప్రవేశంపై బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 31న పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు రజనీ. అయితే, సడెన్‌గా ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.
రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశానికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఇంటి పోరు మొదలైంది. ఈ రాజకీయాలు మనకొద్దు అంటూ రజినీ కూతుర్లు గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వస్తానంటూ మూడేళ్ల క్రితం ప్రకటించి ఇన్నాళ్లకు డేట్స్ ఫిక్స్ చేశారు రజినీ. డిసెంబర్ 31న పార్టీ పేరు, జెండా, గుర్తు ప్రకటిస్తానని అనౌన్స్ కూడా చేశారు. ఈ వేడుక కోసం ఓవైపు అభిమానులు ఎదురుచూస్తుండగానే.. రజినీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అధిక రక్తపోటు కారణంగా ఆస్పత్రిలో చేరారు.
రజినీకాంత్ నటిస్తున్న అన్నాత్తె సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. సెట్‌లో ఆరుగురికి కరోనా సోకడంతో మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉన్నారు రజినీ. సడెన్‌గా అధిక రక్తపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. శనివారం నాడు రజినీని డిశ్చార్జ్ చేయడంతో చెన్నై వెళ్లిపోయారు.
ఈ నేపథ్యంలో కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు రజినీతో రాజకీయాలపై మాట్లాడారు. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం ఆలోచనలో ఉంటున్న కారణంగానే మానసిక ఒత్తిడి పెరుగుతోందని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారని ఆయన కుటుంబసన్నిహిత వర్గాలు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com