Rajinikanth: హాస్పిటల్ నుండి రజినీకాంత్ డిశ్ఛార్జ్..

Rajinikanth (tv5news.in)
Rajinikanth: స్వల్ప అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్ డిశ్ఛార్జి అయ్యారు. నాలుగురోజుల క్రితంరజనీకాంత్ చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. దీంతో తలైవాకి ఏమైందోనని అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే రజనీకాంత్ ఆసుపత్రికి వెళ్లినట్లు, ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సతీమణి తెలిపారు.
రజనీకాంత్ మెదడు రక్తనాళాల్లో బ్లాక్స్‌ను గుర్తించి, అందుకు సంబంధించిన చికిత్స చేసి, వాటిని తొలగించినట్లు కావేరి ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రజనీ కోలుకొని డిశ్ఛార్జి కావడంతో ఆయన అభిమానులు ఊపరిపీల్చుకున్నారు. గతేడాది కూడా రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇటీవలే రజనీకాంత్ ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com