Rajinikanth : అందుకే పొన్నియిన్ సెల్వన్‌లో నేను నటిస్తానంటే మణిరత్నం ఒప్పుకోలేదు : రజనీకాంత్

Rajinikanth : అందుకే పొన్నియిన్ సెల్వన్‌లో నేను నటిస్తానంటే మణిరత్నం ఒప్పుకోలేదు : రజనీకాంత్
Rajinikanth : పొన్నియిన్ సెల్వన్ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలో సీనీ ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగింది

Rajinikanth : పొన్నియిన్ సెల్వన్ మూవీ ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలో సీనీ ప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కమల్ హాసన్, రజినీ కాంత్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మొత్తం కార్యక్రమంలో రజినీ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రాజనీ మాట్లాడుతూ... గతంలో మాజీ సీఎం జయలలిత తనను పొన్నియిన్ సెల్వన్‌లోని వంతియాతివన్‌తో (కార్తి పోషించిన పాత్ర) పోల్చినట్లు చెప్పారు. అప్పుడే పొన్నియిన్ సెల్వన్ నవలను చదవడం ప్రారంభించి పూర్తి చేశానన్నారు.

పొన్నియిన్ సెల్వన్‌లో ఓ చిన్ని క్యారెక్టర్ ఇచ్చినా సంతోషంగా చేస్తానని మణిరత్నంకు చెప్పానన్నారు తలైవా. అయితే మణిరత్నం అందుకు అంగీకరించలేదని. నీ ఫ్యాన్స్‌తో నన్ను తిట్టించుకోవడానికా అని మణిరత్నం తిరిగి నాకు సమాధానం ఇచ్చినట్లు రిజినీకాంత్ చెప్పారు. అదీ మణిరత్నం అంటే అని సభాముఖంగా దర్శకుడు మణిరత్నంను ప్రశంసతలతో ముంచెత్తారు రిజినీకాంత్.

Tags

Read MoreRead Less
Next Story