Rajinikanth : లడ్డూ వివాదం.. స్పందించేందుకు నిరాకరించిన రజనీకాంత్

Rajinikanth : లడ్డూ వివాదం.. స్పందించేందుకు నిరాకరించిన రజనీకాంత్
X

తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ దీనిపై మాట్లాడేందుకు రజనీకాంత్ నిరాకరించారు. చెన్నై ఎయిర్‌పోర్టులో కనిపించిన ఆయనను ఈ అంశంపై స్పందించాలని ఓ రిపోర్టర్ కోరారు. అయితే రజనీ ‘సారీ.. నో కామెంట్స్’ అని చెప్పి వెళ్లిపోయారు. ఇటీవల హీరో కార్తీ లడ్డూ అంశం సెన్సిటివ్ టాపిక్ అని, మాట్లాడొద్దని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ విమర్శలు చేయడంతో ఆయన సారీ చెప్పారు. రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయన్ ది హంటర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రోజు లైకా ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తుంది.

Tags

Next Story