KGF 2: 'కేజీఎఫ్ 2'పై రజినీకాంత్ స్పందన.. షాక్‌లో మూవీ టీమ్..

KGF 2: కేజీఎఫ్ 2పై రజినీకాంత్ స్పందన.. షాక్‌లో మూవీ టీమ్..
KGF 2: తమిళంలో కేజీఎఫ్ 2కు విశేష స్పందన లభిస్తోంది.

KGF 2: యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కేజీఎఫ్ 2'కు ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రశాంత్ నీల్ నుండి తాము ఆశించినంత రేంజ్‌లోనే సినిమా ఉందంటూ సినిమా చూసినవారు ప్రశంసిస్తున్నారు. మళ్లీ మళ్లీ కేజీఎఫ్ 2ను చూడాలని థియేటర్లకు వెళ్తు్న్నవారు కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా చూసిన తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా రెస్పాండ్ అయ్యారట. ఆయన రెస్పాన్స్ చూసి మూవీ టీమ్ షాక్‌లో ఉన్నారని టాక్.

కేజీఎఫ్ 2 చూసిన తర్వాత చాలామంది ప్రేక్షకులతో సహా సినీ ప్రముఖులు కూడా మూవీ టీమ్‌ను ప్రశంసించడం మొదలుపెట్టారు. చాలామంది నటీనటులు, దర్శకులు సైతం యశ్, ప్రశాంత్ నీల్ వర్క్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అయితే సౌత్ భాషలు అన్నింటిలో విడుదలయిన కేజీఎఫ్ 2పై రజినీకాంత్ కూడా స్పందించినట్టు సమాచారం.

తమిళంలో కేజీఎఫ్ 2కు విశేష స్పందన లభిస్తోంది. అందుకే అక్కడ త్వరలో పెద్ద సినిమాల విడుదలలు ఏమీ లేకపోవడంతో కేజీఎఫ్ 2కు స్క్రీన్స్ పెంచాలనే ఆలోచనలో ఉన్నారట డిస్ట్రిబ్యూటర్లు. ఇదే సమయంలో కేజీఎఫ్ చాప్టర్ 2 నిర్మాతకు రజినీకాంత్ స్వయంగా ఫోన్ చేసి సినిమా బాగుంది అంటూ ప్రశంసించారట. స్వయంగా రజినీకాంతే ఫోన్ చేసి ప్రశంసించడంతో మూవీ టీమ్ షాక్‌తో పాటు ఫుల్ ఖుషీలో ఉందట.

Tags

Read MoreRead Less
Next Story