Rajinikanth : 33 ఏళ్ళ తర్వాత మళ్ళీ లెజెండరీ దర్శకుడితో తలైవా

ఇటీవల అనారోగ్య సమస్యలతో కొంత విరామం తీసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. త్వరలోనే తన సినిమా షూటింగ్‌లకు తిరిగి వెళ్లనున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 వేసవిలో విడుదల కానుంది. అంతేకాకుండా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ చిత్రం కూడా ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రాజెక్టులతో పాటు, రజినీకాంత్ మరో భారీ ప్రాజెక్టుకు సైన్ చేశారు.
తమిళ సినీ రంగంలోని మరో లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్ నటించనున్నారు. ఇరువురు కలిసి గతంలో అంటే 33 ఏళ్ళ క్రితం ‘దళపతి’ అనే సినిమా చేశారు. ఇప్పుడు మళ్లీ కలిసి వస్తుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రజినీకాంత్ పుట్టినరోజు నాడు వచ్చే అవకాశం ఉంది.
ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. రజినీకాంత్, మణిరత్నం కాంబినేషన్‌తో పాటు ఏఆర్ రహ్మాన్ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రజినీకాంత్, మణిరత్నం, ఏఆర్ రహ్మాన్ లాంటి లెజెండరీ వ్యక్తులు కలిసి చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళ సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com