Rajinikanth : జాతీయ స్థాయి దర్శకుడితో రజనీకాంత్

Rajinikanth : జాతీయ స్థాయి దర్శకుడితో రజనీకాంత్
X

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే లోకేష్ కనగరాజ్ తో కూలీ, టీజీ జ్ఞానవేల్ తో వేట్టయ్యాన్ సినిమాలు చేస్తున్న రజిని తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. గతేడాది మలయాళంలో వచ్చిన '2018' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌. ఈ దర్శకుడు ఇటీవల రజనీకాంత్ ను కలిసి ఒక పాయింట్ ను వినిపించాడట. అది బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడట సూపర్ స్టార్. వేల్స్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రానున్న ఈ సినిమాపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. దర్శకుడు లోకేష్ తో చేస్తున్న కూలీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత కొత్త సినిమా మొదలవుతుందని సమాచారం.

Tags

Next Story