Rajinikanth : సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్న కూలీ

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న సినిమా కూలీ. సౌత్ లో జైలర్ తర్వాత ఆ రేంజ్ మల్టీస్టారర్ గా వస్తోన్న సినిమా ఇది. అంతమంది స్టార్స్ ఉన్నారు. ఎవరు ఏ పాత్ర చేస్తున్నారు..? అది నెగెటివ్ నా..? పాజిటివ్ నా..? అనేది పక్కన పెడితే వారంతా ఇతర భాషల్లో స్టార్ హీరోలు, నటులే కావడం విశేషం. అయినా ఇది రజినీకాంత్ సినిమాగానే చెప్పాలి. ఆయనే హీరో. మిగతా అంతా ఆయన తర్వాతే. ఇంతకు ముందు జైలర్ లో కూడా ఇలాంటి ఫీట్ తోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు సూపర్ స్టార్. ఇప్పుడు మరోసారి అదే చేస్తున్నారు. అయితే ఇది దర్శకుల మేటర్.
కూలీలో రజినీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్, సౌబిన్ షబీర్, సత్యరాజ్ వంటి స్టార్స్ ఉన్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలనుకున్నారు. ఆ మేరకు లోకేష్ చాలా వేగంగా చిత్రీకరణ చేస్తున్నాడు. కానీ సిట్యుయేషన్ చూస్తే ఆ డేట్ కు రిలీజ్ చేయడం కష్టం అని తేలిపోయిందట. అందుకే మే నుంచి కూలీ చిత్రాన్ని వాయిదా వేస్తున్నారు. మళ్లీ కొత్త డేట్ ఆగస్ట్ లో ఉండొచ్చు అంటున్నారు. ఆగస్ట్ అనగానే అందరికీ ఇండిపెండెన్స్ డే నే గుర్తొస్తుంది కదా. అయితే ఆ డేట్ కు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 మూవీ ఉంది. మరి అదే డేట్ కే వీళ్లూ వస్తారా లేక కొత్త డేట్ చూసుకుంటారా అనేది చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com