NTR War 2 : ఎన్టీఆర్ తో యుద్ధానికి సిద్ధం అంటున్న కూలీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో వార్ కు సై అంటున్నాడు కూలీ. నిజానికి ఈ కూలీకి ఎన్టీఆర్ తో పోటీ ఉండదు అనుకున్నారు.కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో పోటీ తప్పేలా లేదు అని వినిపిస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ లో నటిస్తోన్న సినిమా ‘వార్ 2’.ఈ యేడాది ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా ఈ మూవీ విడుదల కాబోతోంది. అయితే వీరికి షాక్ ఇస్తూ.. రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న కూలీ చిత్రాన్ని కూడా అదే టైమ్ కు విడుదల చేయబోతున్నారని టాక్.
ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో మూవీస్ తో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా తిరుగులేని పేరు తెచ్చుకున్నాడు లోకేష్ కనగరాజ్. తన హీరోలను కొత్తగా చూపించడంలో సూపర్ సక్సెస్ అవుతున్నాడు. అతని దర్శకత్వంలో రజినీకాంత్ మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. పైగా ఈ మూవీలో ఇంకా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శృతి హాసన్, రెబా మోనికా జాన్ వంటి తారాగణం ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ మూవీని ఏప్రిల్ 10న విడుదల చేస్తాం అని ప్రకటించారు.కానీ షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వంటి కారణాలతో ఆగస్ట్ 14కి పోస్ట్ పోన్ చేశారు అంటున్నారు. అదే నిజమైతే వార్ 2 కు సమస్యలు తప్పవు అనే చెప్పాలి. నార్త్ లో ఎలా ఉన్నా.. తమిళ్,కన్నడ, మళయాలంలో మాత్రం కూలీ వల్ల వార్ 2 కు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com