Soundarya Rajinikanth: మా ఇంట్లోకి మరో క్యూట్ బంగారం: రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య..

Soundarya Rajanikanth: సెప్టెంబరు 11, 2022న, సౌందర్య రజనీకాంత్ చైన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదిస్తున్నానంటూ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది సౌందర్య.
సౌత్ సూపర్ స్టార్, రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్. నిర్మాతగా పలు చిత్రాను తెరకెక్కించారు. తన తండ్రికి అత్యంత ప్రియమైన కూతురు సౌందర్య. గతంలో సౌందర్య వ్యాపారవేత్త అశ్విన్ రామ్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. అతనితో తన ఏడేళ్ల వివాహాన్ని ముగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ జంటకు ఒక కొడుకు వేద్ ఉన్నాడు.
తరువాత, ఫిబ్రవరి 11, 2019 న, సౌందర్య విశాగన్ వనంగముడిని వివాహం చేసుకున్నారు. ఈ జంట వివాహమైన మూడు సంవత్సరాల తర్వాత తమ జీవితంలోకి మరో బిడ్డను ఆహ్వానించారు.
తనకు మగబిడ్డ జన్మించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తన మొదటి బిడ్డ, భర్త విశాగన్‌తో దిగిన చిత్రాలను పోస్ట్ చేశారు. అమూల్యమైన చిత్రాలతో పాటు సౌందర్య తన నవజాత శిశువు తన చిన్న చేతితో తల్లి వేలిని పట్టుకున్న చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. తమ బిడ్డకు 'వీర్ రజనీకాంత్ వనంగముడి' అని పేరు పెట్టినట్లు సౌందర్య రాసుకొచ్చారు.
"దేవుని దయ మరియు మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఈరోజు 11/9/22 వేద్ చిన్న తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడిని స్వాగతించడం పట్ల విశాగన్, వేద్ మరియు నేను సంతోషిస్తున్నాము. మా అద్భుతమైన వైద్యులకు ధన్యవాదాలు. "అని ఆమె సౌందర్య తెలిపారు.
గతంలో సౌందర్య ఒక ఇంటర్వ్యూలో, తన రెండవ భర్త అయిన విషగన్‌తో తన పరిచయం వెల్లడించారు.
మాది లవ్ మ్యారేజ్ కాదు. పెద్దలు కుదిర్చిన వివాహమే. మా నాన్నగారి ప్రియ మిత్రుడు విషగన్ గురించి ప్రస్తావించారు. ఆ దశలో, నేను ఇంకా కమిట్‌మెంట్‌లోకి రావాలని అనుకోలేదు. కానీ నేను, విశగన్ మొదటిసారి కలిసినప్పుడు ఏదో దైవిక శక్తి మమ్మల్ని కలిపింది అని అనిపించిందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com