Aamir Khan : ఆమిర్ ఖాన్, రాజ్ కుమార్.. ఓ బయోపిక్

రాజ్ కుమార్ హిరాణీ అంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఓ స్పెషల్ పేజ్ ఉన్న దర్శకుడు. ప్రతి సినిమానూ కల్ట్ అనే స్థాయిలో రూపొందించాడు. బలమైన కథ, కథనాలకు తోడు అద్భుతమైన టేకింగ్ ఆద్యంతం ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇక రాజ్ కుమార్, ఆమిర్ ఖాన్ కాంబోలో వచ్చిన త్రీ ఇడియట్స్, పికే చిత్రాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అలాంటి క్రేజీ కాంబోలో మరో సినిమా మొదలు కాబోతోంది. అయితే ఇది ఎన్టీఆర్ చేస్తాడు అని రూమర్స్ వచ్చిన మూవీ కావడం విశేషం.

ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా చెప్పుకునే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ను ఈ ఇద్దరూ కలిసి రూపొందించబోతున్నారు. రాజ్ కుమార్ డైరెక్షన్ లో దాదా సాహెబ్ గా ఆమిర్ ఖాన్ నటించబోతున్నాడు అనే కొత్త వార్తలు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇది కన్ఫార్మ్ అంటున్నారు. నిజానికి ఈ పాత్ర ఎన్టీఆర్ చేయబోతున్నాడు అంటూ రెండు రోజులుగా వార్తలు వచ్చాయి. బట్ అది రూమరే అని కూడా చాలామంది ఊహించారు.

ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న రేంజ్ కు ఇలాంటి బయోపిక్స్ చేస్తే ఇబ్బంది తప్పదు. అందుకే అతను అలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనుకోలేం. ఎన్టీఆర్ స్థానంలో ఆమిర్ ఖాన్ అంటే కూడా పర్ఫెక్ట్ ఛాయిస్ అనే చెప్పాలి. మరి ఈ బయోపిక్ ను రాజ్ కుమార్ హిరానీ ఎంత హృద్యంగా రూపొందిస్తాడో చూడాలి.

Tags

Next Story