Rajpal Yadav: హీరో అవుదామని వచ్చి ట్రాన్స్‌జెండర్‌గా మారి..

Rajpal Yadav: హీరో అవుదామని వచ్చి ట్రాన్స్‌జెండర్‌గా మారి..
X
Rajpal Yadav : రవితేజ నటించిన కిక్ 2 లో రాజ్‌పాల్ యాదవ్ నటించాడు.

Rajpal Yadav : హీరో అవుదామని వచ్చి ట్రాన్స్‌జెండర్‌గా మారి..బాలీవుడ్ నటుడు రాజ్‌పాల్ నౌరంగ్ యాదవ్ హాస్యనటుడు, రచయిత, దర్శకుడు, నిర్మాత. విభిన్న రంగాల్లో ప్రావిణ్యం ఉన్న వ్యక్తి. హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు.

రవితేజ నటించిన కిక్ 2 లో రాజ్‌పాల్ యాదవ్ నటించాడు. బాలీవుడ్ చిత్రం జంగిల్‌లో అతడి నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. 'అర్ధ్' రాజ్‌పాల్ యాదవ్ ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రుబీనా దిలైక్, హితేన్ తేజ్వానీ, కులభూషణ్ ఖర్బందా నటించారు.

ఈ చిత్రంలోని తన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు రాజ్ పాల్. పోస్టర్‌లో, రాజ్‌పాల్ యాదవ్ నారింజ రంగు చీరను ధరించి, జడలో పువ్వులు పెట్టుకున్నాడు. సినిమా హిట్ అవుతుందని, 'అద్భుతం'గా ఉందంటూ అభిమానులు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

కాగా హీరో అవుదామని ముంబైకి వచ్చి, ఛాన్సులు రాక ట్రాన్స్‌జెండర్‌గా మారిన ఓ వ్యక్తి కథే అర్థ్ అని తెలుస్తోంది. ఈ చిత్రం OTTలో విడుదల కానుంది. అర్ధ్ సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం. స్క్రిప్ట్ కూడా తనే రాసుకున్నాడు.

Tags

Next Story