Tollywood: జూలై 29న "రాజుగారి కోడిపులావ్" గ్రాండ్ రిలీజ్

Tollywood: జూలై 29న  రాజుగారి కోడిపులావ్ గ్రాండ్ రిలీజ్
X

ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం "రాజు గారి కోడిపులావ్". ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని జూలై 29న రిలీజ్ కానుంది. త్వరలోనే 'రాజు గారి కోడిపులావ్' చిత్ర ట్రైలర్ విడుదల కానున్నట్లు చిత్ర యునిట్ తెలిపింది.

నిర్మాతగా, డైరెక్షన్ బాధ్యతలు వహిస్తూనే శివ కోన ఈ చిత్రంలో డ్యాని పాత్రలో నటించారు. బుల్లితెర మెగాస్టార్ గా పేరున్న ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరితోపాటు నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు.

రీ యూనియన్ బ్యాచ్ గా కలిసిన కొంతమంది స్నేహితులు సరదాగా గడపడానికి ఒక అడవి ప్రాంతానికి వెళ్తారు. అనుకోకుండా అక్కడ ఎదురైన విపత్కర పరిస్థితుల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చేసిన సాహసమే రాజుగారి పులావ్ సినిమా. ఆద్యంతం సస్పెన్స్ క్రిమ్ థ్రిల్లర్ తో పాటు అందమైన ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.





Tags

Next Story