Cinema: ఆగస్టు 4 రిలీజ్ కానున్న 'రాజు గారి కోడిపులావ్'

Cinema: ఆగస్టు 4 రిలీజ్ కానున్న రాజు గారి కోడిపులావ్
X
'రాజు గారి కోడిపులావ్' లోని జోకర్ రోల్ రివీల్

'రాజు గారి కోడిపులావ్' సినిమాతో నూతన దర్శకుడిగా పరిచయమవుతున్నారు శివ కోన. కుటుంబ కథా 'వి'చిత్రం అనే ట్యాగ్ తో రాబోతున్న ఈ సినిమాను ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీలిజ్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. 'రాజు గారి కోడిపులావ్' చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దాంతో పాటు ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'వాట్ ద ఫ* ఈజ్ ఆఫ్ కోడిపులావ్' అనే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు.

ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా సాగే ఈ చిత్రంలో జోకర్ పాత్ర ఎంతో కీలకంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. అలాంటి జోకర్ రోల్ ను రివిల్ చేస్తూ విడుదల చేసిన ఈ వీడియో కూడా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ వస్తోంది. అలాగే ఈ చిత్రం నుంచి విడుదలైన సునో సునారే సాంగ్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాలో అందరూ కొత్త నటులే అయినప్పటికీ వారి పెర్ఫామెన్స్ తో సినిమాపై ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతోంది. బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే బ్రాడ్ మైండ్ ఉన్నవారు చూసేలా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేసింది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకోగా.. ఈ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా యూట్యూబ్ ను షేక్ చేస్తూ 1 మిలియన్ మైలురాయి దిశగా దూసుకెళ్తోంది. చిన్న సినిమాగా ప్రారంభమైన ఈ చిత్రం.. ఇంతలా ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందుతుందనడానికి ట్రైలరే నిదర్శనగా నిలుస్తోంది. ఇప్పటికే ట్రైలర్ తో ఎంజాయ్ చేసిన సినిమా ప్రేక్షకులు.. ఫుల్ మూవీపై మరింత క్యూరియాసిటీని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.


విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే మూవీపై మరింత హైప్ ను తీసుకువచ్చేందుకు.. రకరకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. దాంతో పాటు అనేక ప్లాట్ ఫార్మ్స్ లో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో పాల్గొంటూ మంచి అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. మూవీ ఔట్ ఫుట్ పై ఎంతో నమ్మకంగా ఉన్న మూవీ యూనిట్.. ఆగస్టు 4న ప్రేక్షకులు ఇచ్చే రివ్యూ కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది. మంచి కంటెంట్ తో సినిమా తీస్తే, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారన్న నినాదంతో ఈ సినిమాతో మరోసారి నిరూపితమవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఈటీవీ ప్రభాకర్, నేహా దేశ్ పాండే, కునాల్ కౌశల్, ప్రాచీ కెథర్, రమ్య దేష్, అభిలాష్ బండారి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ పనులు ఊపందుకోగా.. ట్రైలర్లో చూపించినట్లు ప్రతి సీన్ చాలా కొత్తగా, వైవిధ్యంగా, ఎంతో ఉత్కంఠ భరితంగా ఉంటుందని.. ప్రేక్షకుడు సీటు అంచున కూర్చుని ఆసక్తిగా చూసే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్ అందించగా, ప్రవీణ్ మనీ సంగీతాన్ని అందించారు. ఎడిటర్ గా బసవ పనిచేశారు.


Tags

Next Story