Rakhi Sawant : రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ పై రేప్ కేసు

Rakhi Sawant : రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ పై రేప్ కేసు

బాలీవుడ్ నటి రాఖీ సావంత్ భర్త ఆదిల్ ఖాన్ దురానీపై రేప్ కేసు నమోదైంది. ఇరాన్ కు చెందిన ఓ యువతి ఆదిల్ ఖాన్ పై రేప్ కేసు పెట్టింది. మైసూర్ లోని వివి పురం పోలీస్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 376 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇరాన్ యువతిపై ఆదిల్ ఖాన్ అత్యాచారానికి పాల్పడినట్లు కంప్లైంట్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే రాఖీ సావంత్ పెట్టిన కేసులో ఆదిల్ జైలులో ఉన్నాడు. 14రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆదిల్ పై ఇది రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది.


మైసూర్ లో ఆదిల్ ఖాన్ తో కలిసి సహజీవనం చేసినట్లు ఇరాన్ యువతి తెలిపింది. సహజీవనం చేస్తున్నప్పుడు పెళ్లి సాకుతో తనపై ఆదిల్ అత్యాచారం చేశాడని యువతి తన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. ఐదు నెలల క్రితం తనను పెళ్లి చేసుకోవాలని కోరగా.. అతడు తిరస్కరించాడని చెప్పింది. ఆదిల్ కు చాలామంది అమ్మాయిలతో ఫిజికల్ ఎఫేర్స్ ఉన్నట్లు పేర్కొంది. సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపెట్టి తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడని చెప్పింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... IPC సెక్షన్ 376, 417, 420, 504, 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఆదిల్ గృహ హింసకు పాల్పడినట్లు రాఖీ సావంత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతన్ని అరెస్ట్ చేశారు. ఆదిల్ ను ఓషిరా పోలీస్ స్టేషన్ కు విచారణ కోసం పిలిచి అరెస్ట్ చేశారు. ఆదిల్ కు వివాహేతరసంబంధాలు ఉన్నాయని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది రాఖీ సావంత్.

Tags

Read MoreRead Less
Next Story