Rakhi Sawant : రాఖీ సావంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..

Rakhi Sawant : బాలీవుడ్ సెక్స్ సింబల్ రాఖీ సావంత్ ఈసారి మరోసారి సినీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఇండియాలో బిగ్‌బాస్ షో స్టార్ట్ అయిన మొదటి సీజన్‌లో రాఖీ సావంత్ కంటెస్టెంట్‌గా ఎంపికైంది. అప్పటి నుంచి అంటే 2006 నుంచి రాఖీ సావంత్ తనదైన శైలిలో ప్రేక్షకులను మీడియాను ఆకట్టుకుంటూ అవకాశాలను చేజిక్కించుకుంటూ ఉంటుంది. మొహమాటం లేకుండా అనుకున్నది మాట్లాడడంలో ఆమె తరువాతే ఎవరైనా.
రీసెంట్‌గా ఆమె తన భర్త రితీశ్ సింగ్‌తో విడిపోయి మరో బిజినెస్‌మాన్‌తో ప్రేమాయణం మొదలు పెట్టింది. రాఖీ సావంత్ తన అభిమానులతో ఓ చేదు వార్తను పంచుకుంది. తనకు గర్భాశయంలో కణతి ఉండడం వల్ల డాక్టర్లు 4 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి దాన్ని తొలగించినట్లు చెప్పింది.
ప్రస్తుతం ముంబయిలోని క్రిటికేర్ ఆసుపత్రిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే శస్త్ర చికిత్సకు ముందు బాయ్‌ఫ్రెండ్ ఆదిల్‌లో కలిసి ఆసుపత్రిలోనే చిందులేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులతోపాటు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com