Rakshasa Kavyam Teaser Launch : మైథాలజీ నుంచి ఇన్స్ పైర్ అయ్యి ఈ సినిమా తీశా: డైరెక్టర్ శ్రీమాన్ కీర్తి
గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్న 'రాక్షస కావ్యం' సినిమాను దర్శకుడు శ్రీమాన్ కీర్తి తెరకెక్కిస్తున్నారు. నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో బలగం దర్శకుడు వేణు యెల్దండి, యంగ్ హీరో తిరువీర్ గెస్ట్ లుగా హాజరయ్యారు.
"మైథాలజీ నుంచి ఇన్స్ పైర్ రాసుకున్న కథతో రాక్షస కావ్యం సినిమాను తెరకెక్కించాను. ఈ కథను 30, 40 మంది ప్రొడ్యూసర్స్ కు చెప్పా. వాళ్లు డేర్ చేయలేకపోయారు. కానీ దాము గారు కథ విని సినిమా చేద్దామని ముందుకొచ్చారు. పురాణాల్లోని జయ విజయులు ఒక్కో యుగంలో ఒక్కో రాక్షసుల్లా పుట్టారు. వాళ్లు ఇప్పుడు కలియుగంలోకి వస్తే ఎలాంటి పనులు చేస్తారనే ఫిక్షనల్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుంది. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. సినిమాను కూడా ఇష్టపడతారు" అని దర్శకుడు శ్రీమాన్ కీర్తి అన్నారు.
"కొత్తగా ఏదైనా సినిమా చేయాలనే తపన ఉన్న టీమ్ అంతా కలిసి “రాక్షస కావ్యం” చేశారు. ప్యారలల్ సినిమా కోసం స్ట్రగుల్ పడుతున్న బ్యాచ్ వీళ్లు. టీజర్ చూశాను చాలా బాగుంది. ఎదో కొత్తదనం సినిమాలో ఉండబోతోంది అని అర్థమైంది. మీకూ టీజర్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి ప్యాషనేట్ టీమ్ ను ఎంకరేజ్ చేయండి. దాము,అన్న శ్రీమాన్, నవీన్, అన్వేష్, యాదమ్మ రాజు..ఇలా అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్వేష్ కొత్త పోరడు వెబ్ సిరీస్ నన్ను ఇన్ స్పైర్ చేసింది. “రాక్షస కావ్యం” హిట్ కావాలని కోరుకుంటున్నా"నని బలగం డైరెక్టర్ వేణు చెప్పారు.
"ఒక చిన్న జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన నా మిత్రుడు దాము ప్రొడ్యూసర్ గా ఎప్పటికీ గుర్తుండే సినిమాలు చేస్తున్నారు. జార్జ్ రెడ్డి తర్వాత “రాక్షస కావ్యం” ఆయన సంస్థలో మెమొరబుల్ మూవీ అవుతుంది. ఈ సినిమాలో రెండు పాటలు రాశాను. సినిమా చూశాను. నిజంగా ఇదొక వైవిధ్యమైన చిత్రంగా పేరు తెచ్చుకుంటుంద"ని లిరిక్స్ రైటర్ మిట్టపల్లి సురేందర్ వ్యాఖ్యానించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com