ఇక్కడ నాని, కీర్తి సురేష్.. అక్కడ వాళ్లు.

ఒకే సినిమాలో నటించిన ఆర్టిస్టులకు ఎక్కువ అవార్డ్స్ రావడం చూస్తుంటాం. అయితే అదే సినిమా హీరో హీరోయిన్ కు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డ్ రావడం అరుదుగా చూస్తుంటాం. ఈ సారి తెలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో దసరా సినిమాలో నటించిన నాని, కీర్తి సురేష్ ఇద్దరికీ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. దీంతో పాటు మరో నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు కూడా అందుకుందీ మూవీ. అయితే తెలుగులో లాగానే కన్నడలో కూడా ఒకే మూవీలో నటించిన రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ లకు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ గా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ రావడం విశేషం.
ఈ 69వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు ఈ సారి ఎక్కువ విమర్శలకు తావివ్వలేదు అనే చెప్పాలి. మాగ్జిమం అవార్డ్స్ జెన్యూన్ గానే కనిపించాయని అంతా అనుకుంటున్నారు. ఇక గతేడాది సప్తసాగర దాచే ఎల్లో( తెలుగులో సప్తసాగరాలు దాటి ) అనే మూవీతో విమర్శకులను విపరీతంగా మెప్పించారు.. హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రుక్మిణి వసంత్. ఇదే సినిమా తెలుగులో డబ్ అయితే మనవాళ్లు కూడా బాగా చూశారు.. ఆదరించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ మూవీ సెకండ్ పార్ట్ కోసం తెలుగువాళ్లు కూడా ఈగర్ గా ఎదురుచూశారు అంటే అదీ వాళ్ల స్టామినా. తెలుగులో నాని, కీర్తి సురేష్ ఎలాగైతే ఒకే మూవీతో ఇద్దరూ బెస్ట్ యాక్టర్స్ గా అవార్డ్స్ అందుకున్నారో.. కన్నడ నుంచి ఈ జంట అలా బెస్ట్ యాక్టర్స్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.
ఈ మూవీతో వచ్చిన క్రేజ్ తోనే రుక్మిణి వసంత్ తెలుగులోనూ పరిచయం అవుతోంది. రవితేజ సరసన ఒక సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సరసన మరో సినిమా చేస్తోంది. ఈ రెండూ విజయం సాధిస్తే అమ్మడికి టాలీవుడ్ రెడ్ కార్పెట్ వేస్తుందని వేరే చెప్పక్కర్లేదేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com