Rakul Preet Singh: అమ్మానాన్న కూడా ప్రేక్షకులే.. ఆ సినిమాలో నటిస్తానంటే.. : రకుల్ ప్రీత్

Rakul Preet Singh: అమ్మానాన్న కూడా ప్రేక్షకులే.. ఆ సినిమాలో నటిస్తానంటే.. : రకుల్ ప్రీత్
Rakul Preet Singh: ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేయాల్సి ఉంటుంది. అందుకే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందామని చత్రీవాలిలో నటించడానికి ఓకే చెప్పాను

Rakul Preet Singh: కొన్ని సినిమాలు ప్రేక్షకులు అంగీకరించదు.. కానీ అలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి.. ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని చేయాల్సి ఉంటుంది. అందుకే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందామని చత్రీవాలిలో నటించడానికి ఓకే చెప్పాను అంటోంది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.

ఎక్స్ పోజింగ్ కి ఏ మాత్రం పరిమితులు విధించుకోని రకుల్ ఇదే విషయమై నెటిజన్ల చేతిలో చీవాట్లు కూడా తింటుంది.. అయినా తను నడిచే దారిలో ఇవన్నీ కామన్ అని దులిపేసుకుని వెళ్లి పోతుంది.. అన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం.. అమ్మానాన్న కూడా నా సినిమాలకు ప్రేక్షకులే.. వాళ్లకు లేని బాధ మీకెందుకు అని తిరిగి ప్రశ్నిస్తుంది..

ఈ నేపథ్యంలో ఆమె తాజాగా నటిస్తున్న హిందీ చిత్రం ఛత్రివాలి.. ఇందులో ఆమె కండోమ్ టెస్టర్ అనే బోల్డ్ పాత్రలో నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఛత్రీవాలీలో తన పాత్ర గురించి మీడియాతో ముచ్చటించింది.

అలాగే ఈ పాత్రపై తల్లిదండ్రులు ఎలా స్పందించారో కూడా తెలిపింది. ఇదేమీ కొత్త విషయం కాదు.. ఇది ఓ కుటుంబ కథా చిత్రం .. చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయి కండోమ్ టెస్టర్ క్వాలిటీ హెడ్ గా మారిన ఓ అమ్మాయి కథ. మొదట జీతం కోసమే పని చేసినా ఆ తరువాత దాని ప్రాధాన్యత ఏంటో తెలుసుకుంటుంది. అలాగే మనం ఎలా పుడతామో అందరికీ తెలుసు.. కానీ దాని గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడతాం.. యువతకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. ఏం చేయాలో ఏం చేయకూడదో స్పష్టంగా తెలియాలి.

ఈ సినిమాలో నా పాత్ర గురించి అమ్మా నాన్నకు చెబితే మరో ఆలోచన లేకుండా చేయమన్నారు. ఇదే కాదు ఏ చిత్రం చేసినా వారికి ముందుగా వివరిస్తాను.. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాకే ఆ చిత్రంలో నటించడానికి ఓకే చెబుతాను అని చెప్పుకొచ్చింది రకుల్. కాగా ఛత్రీవాలీతో పాటు అటాక్, రన్ వే 34, డాక్టర్ జి, అయలాన్, మిషన్ సిండ్రెల్లా తదితర చిత్రాల్లో నటిస్తోంది ఈ పంజాబీ బ్యూటీ.

Tags

Read MoreRead Less
Next Story