సినిమా

Rakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు: రకుల్ ప్రీత్

Rakul Preet Singh: అందరూ మాట్లాడుకోవలసింది.. మేం చేసే వర్క్ గురించి మాట్లాడుకోవాలి.

Rakul Preet Singh: మాట్లాడుకోవల్సింది మా పర్సనల్ లైఫ్ గురించి కాదు: రకుల్ ప్రీత్
X

Rakul Preet Singh: వ్యక్తిగత జీవితం గురించి కాదు.. మాట్లాడుకోవలసింది వృత్తి జీవితం గురించి.. మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాం.. ఆ విషయం నా ద్వారానే ప్రపంచానికి తెలియాలి.. దాన్ని దాచి పెడితే ఏవేవో రాస్తారు.. అందుకే ముందే నా బాయ్ ఫ్రండ్ జాకీ భగ్నానీ గురించి అందరికీ తెలియజేశాను అని అంటోంది ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్.

వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ఇటీవల రన్ వే 34తో బీ టౌన్ ప్రేక్షకులను అలరించిన ఆమె తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్ పరంగా తానెంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. అనంతరం తన ప్రేమ గురించి కూడా వివరించింది. మంచి మనసున్న వక్తి అని జాన్ భగ్నానీ గురించి తెలిపింది.

మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం.. మా బంధం మరింత బలంగా మారడంతో ఆ విషయం అందరితో పంచుకున్నాం.. లేదంటే మా గురించి వచ్చే వార్తలు, అసత్య ప్రచారాలతో ప్రశాంతత ఉండదు. మా పర్సనల్ లైఫ్ గురించి కాదు అందరూ మాట్లాడుకోవలసింది.. మేం చేసే వర్క్ గురించి మాట్లాడుకోవాలి.

ఎవరికైనా వారి వ్యక్తి గత జీవితానికి సంబంధించిన ఒక స్పేస్ ఉంటుంది.. అందులోకి తొంగి చూడాలనుకోకూడదు. రిలేషన్ షిప్ లో ఉండడం అనేది కామన్.. మన జీవితాల్లో తల్లిదండ్రులు, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎలా ఉంటారో అలాగే మనకంటూ కొందరు స్నేహితులు ఉంటారు.. అందులో మనకు దగ్గరైన వారుంటారు.. ఇది ఎవరి జీవితంలో అయినా సహజం.. అయితే మేం సెలబ్రెటీలు కావడం వల్ల అందరి దృష్టి మాపై ఎక్కువగా ఉంటుంది. అందుకే అలా ఉండడం మాకిష్టం లేదు.. ఎవరూ మా గురించి చెడుగా మాట్లాడుకోకూడదని బయటకు చెప్పేశాం అని రకుల్ తెలిపారు.

రకుల్ ఇంకా ఇలా అన్నారు.. మా వృత్తిపరమైన రంగానికి వచ్చేసరికి మేమిద్దరం మా వ్యక్తిగత ప్రయాణాలలో ఉన్నాము. అంతే.. ఎవరు ఏం రాసినా మేం వాటిని పట్టించుకోము. నాకు ముఖ్యమైనది నా నటన, నేను నా వృత్తిని ఉద్యోగంలా చూస్తాను, నేను వృత్తిరీత్యా నటించే అమ్మాయిని, నేను షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్ళినప్పుడు, నేను చాలా సాధారణ జీవితాన్ని గడిపే అమ్మాయిని, ఇది నేను పెరిగిన వాతావరణం నాకు నేర్పింది. ఇది చాలా ముఖ్యం అని తెలిపింది.

గత ఏడాది రకుల్ పుట్టినరోజు నాడు తాను తన స్నేహితుడు, నిర్మాత, నటుడు అయిన జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానని తెలిపింది. అతడితో స్నేహం తన జీవితంలో వెలుగులు పంచిందని రకుల్ వివరించింది.

Next Story

RELATED STORIES