టాలీవుడ్ డ్రగ్స్ కేసు : రకుల్ ప్రీత్ సింగ్‌పై ప్రశ్నల వర్షం..!

టాలీవుడ్ డ్రగ్స్ కేసు పెను దుమారమే రేపుతోంది.. ఈ కేసులో విచారణకు హాజరైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు ఈడీ అధికారులు.. ఉదయం పదిన్నరకు ఆమె ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కాగా.. సాయంత్రం నాలుగున్నర వరకు ఆమెను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు అధికారులు.. ఆరు గంటలకుపైగా సాగిన విచారణలో ప్రధానంగా బ్యాంకు లావాదేవీలపైనే ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.. మొత్తం 30కిపైగా ప్రశ్నలు సంధించిన ఈడీ అధికారులు.. అనేక ప్రశ్నలకు రకుల్ నుంచి సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది.. అటు కెల్విన్‌తో సంబంధాలు, ఎఫ్ క్లబ్‌లో పార్టీపై ఆరా తీశారు అధికారులు. అలాగే రియా చక్రవర్తితో ఫ్రెండ్‌షిప్ గురించి కూడా అడిగారు.. సాయంత్రం నాలుగున్నరకు విచారణ ముగించిన అధికారులు.. మళ్లీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని రకుల్‌కు సూచించారు.. అనంతరం ఆమె ఫోన్ స్వాధీనం చేసుకుని పంపించారు.. అటు ఈనెల 13న ఎఫ్ క్లబ్ మేనేజర్, నటుడు నవదీప్ విచారణ తర్వాత రకుల్ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com