Rakul Preet Singh marriage: పెళ్లి పీటలెక్కనున్న రకుల్.. ఆ బాలీవుడ్ హీరోకి బర్త్‌డే సర్‌ప్రైజ్..

Rakul Preet Singh marriage: సినీ రంగంలో నచ్చిన హీరో.. వారికి నచ్చిన హీరోయిన్‌తో కలిసి డేటింగ్ చేయడం సహజం. ఈ డేటింగ్ కల్చర్ ఇప్పటినుండే కాదు చాలాకాలంగా నడుస్తూ ఉన్నదే. కానీ అలాంటి కల్చర్‌లో కూడా జీవితాంతం కలిసుండాలి అనుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. ఈమధ్య చాలామంది హీరోలు, హీరోయిన్లు సింగిల్ నుండి కమిటెడ్‌గా మారిపోతున్నారు. అందులో కొందరు పెళ్లితో ఒకటవుతున్నారు కూడా. తాజాగా మరో హీరోయిన్ తన లవ్ లైఫ్ గురించి సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్.. హీరోయిన్‌గా పరిచయమయ్యింది సౌత్ సినిమాలతోనే అయినా ప్రస్తుతం తాను హిందీలోనే మోస్ట్ బిజీ నటిగా మారిపోయింది. దాదాపు అరడజను హిందీ సినిమాలతో ఈ భామ బీ టౌన్‌లోనే బిజీగా గడిపేస్తోంది. తాజాగా రకుల్ తాను హిందీ హీరో జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నానంటూ తనతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో పాటు తన ప్రియుడి కోసం ఒక అందమైన క్యాప్షన్‌ను కూడా పెట్టింది రకుల్. పుట్టినరోజు సందర్భంగా తాను ఈ విషయం వెల్లడించడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com