Rakul Preet Singh: రకుల్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా చిత్రం.. ఏకంగా ఆ స్టార్‌తో..

Rakul Preet Singh (tv5news.in)
Rakul Preet Singh: సినీ పరిశ్రమలో హీరోలలో ఎంతగా పోటీ నడుస్తుందో హీరోయిన్లలో కూడా అంతే పోటీ ఉంటుంది. పైగా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఎవరైనా కొత్త హీరోయిన్ వచ్చి పాపులారిటీ సంపాదించుకుంటే చాలు.. మేకర్స్ అంతా తన డేట్స్ కోసం ప్రయత్నిస్తారు. అందుకే సీనియర్ హీరోయిన్లకు అవకాశాలు తగ్గిపోతాయి. అందులో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్.
కేవలం పదేళ్ల కెరీర్‌లోనే రకుల్ ఎన్నో సినిమాల్లో మెరిసింది. సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో కూడా తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. కానీ అంతే తొందరంగా రకుల్ కెరీర్ స్లో అవ్వడం మొదలయ్యింది. తెలుగులో అవకాశాలు వస్తున్నా సరే.. వాటిని పక్కన పెట్టి మరీ బాలీవుడ్‌కు వెళ్లింది రకుల్. కానీ అక్కడ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో రకుల్ కెరీర్‌కు పెద్ద బ్రేకే పడింది.
ఇటీవల ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటే రకుల్ మాత్రం ఒకట్రెండు అవకాశాలతో నెట్టుకొస్తోంది. కానీ ఫైనల్‌గా రకుల్‌కు కూడా పాన్ ఇండియా చిత్రంలో ఛాన్స్ దక్కినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం రకుల్ చేతిలో చాలా సినిమాలు ఉన్నా.. అవన్నీ బాలీవుడ్ చిత్రాలే. అయితే చాలాకాలం తర్వాత కోలీవుడ్‌లో అడుగుపెట్టనున్న రకుల్.. ఓ స్టార్ సినిమాలో మెరవనుంది.
రకుల్ కెరీర్ ప్రారంభంలోనే కోలీవుడ్‌లో హీరోయిన్‌గా మెరిసింది. కానీ అవేవి తనకు గుర్తింపు తెచ్చిపెట్టకపోవడంతో టాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది. ఇన్నాళ్లకు అజిత్‌లాంటి స్టార్ హీరో సినిమాతో మళ్లీ కోలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది ఈ భామ.
ఇప్పటికే శివకార్తికేయన్‌తో ఒక సినిమా చేసినా.. అది విడుదల విషయంలో వాయిదా పడుతుంది. ఇక ఇప్పుడు అజిత్, హెచ్ వినోథ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో రకులే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. అంతే కాకుండా అజిత్ ఇతర సినిమాలలాగానే ఇది కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుందని టాక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com