Rakul Preet Singh: 'అదంతా తెలుసుకోవడానికి నాకు మూడు రోజులు పట్టింది': రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh (tv5news.in)
Rakul Preet Singh: ఒక సినిమాలోని ఒక పాత్రలో లీనమవ్వాలంటే నటీనటులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వారు.. వారికి అస్సలు సంబంధం లేని, తెలియని పాత్ర చేయాల్సి ఉంటుంది. ఇలాంటిప్పుడే వారికి ట్రైనింగ్ అవసరం. అలా రకుల్ ప్రీత్ కూడా తన అప్‌కమింగ్ హిందీ సినిమా కోసం చాలా కష్టపడ్డానంటూ చెప్పుకొచ్చింది.
రకుల్ ప్రీత్.. హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ అయ్యింది తెలుగులోనే అయినా.. ప్రస్తుతం తన చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. గత కొంతకాలంగా వరుస హిందీ సినిమా ఆఫర్లు అందుకుంటూ.. బాలీవుడ్‌లోనే బిజీ అయిపోయింది ఈ భామ. అయితే జాన్ అబ్రహంతో రకుల్ నటించిన 'ఎటాక్'.. ఏప్రిల్ 1న విడుదల కానుండగా ప్రస్తుతం తాను ప్రమోషనల్ కార్యక్రమాలలో బిజీగా ఉంది.
జాన్ అబ్రహం ఇతర సినిమాలలాగే ఎటాక్ కూడా ఒక యాక్షన్ డ్రామా. అయితే ఈ సినిమాలో రకుల్ ఒక సైంటిస్ట్‌గా కనిపించనుందట. ఆ పాత్ర కోసం తాను చాలా కసరత్తు చేసినట్టు రకుల్ తెలిపింది. ల్యాబ్‌లో తనకు అలవాటు అవ్వడానికే రెండు, మూడు రోజులు పట్టిందట. తాను ఒక సైంటిస్ట్‌గా అక్కడ ఉన్న పరికరాలు అన్ని అలవాటు ఉన్నట్టు నటించడానికి చాలా కష్టపడ్డానంటూ తెలిపింది రకుల్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com